హోం మంత్రి అనిత‌పై భ‌గ్గుమ‌న్న ప్ర‌భాక‌ర్ రెడ్డి

కావాల‌ని గ‌న్ లైసెన్స్ ఇవ్వ‌డం లేదంటూ ఫైర్

hellotelugu-JCPrabhakarReddy

అనంత‌పురం జిల్లా : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అనంత‌పురం జిల్లాకు చెందిన అధికార పార్టీ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి . ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తూ ఏకంగా హోమ్ మంత్రిని టార్గెట్ చేశారు. తాజాగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారితీశాయి. వంగ‌ల‌పూడి అనిత కావాల‌ని త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ఫైర్ అయ్యారు.

ఈ ప్రభుత్వంలో నాకు, నా కుమారుడికి అవమానం జ‌రిగింద‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నేను నా కుమారుడు ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినా పని కావ‌డం లేదంటూ మండిప‌డ్డారు. హోంమంత్రి అనితకు ఎన్నోసార్లు లేఖ‌లు రాశాన‌ని అన్నారు. ఇది నన్ను అవమానించడమే, ఎమ్మెల్యేను అవమానించడమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే, ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటి అని హోం మంత్రి అనిత‌ను, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును సూటిగా ప్ర‌శ్నించారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఇది చెబితే ఎవరికైనా బాధ కలగొచ్చు. కానీ మాకూ ఉన్నాయి సొంత బాధలు. జైలుకు వెళ్లాం, ఐదేళ్లు కష్టపడ్డాం అన్నారు.

Exit mobile version