Java Plum Seeds Powder Proven : షుగర్ ను కంట్రోల్ చేసే అత్యంత అద్భుతమైన ఔషధం ఇదే

దీని వలన క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలు, డయాబెటిస్‌ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశముంది...

Hello Telugu - Java Plum Seeds Powder Proven

Hello Telugu - Java Plum Seeds Powder Proven

Java Plum Seeds : మధుమేహం నియంత్రణతోపాటు జీర్ణక్రియను మెరుగుపరిచే సామర్థ్యం కలిగిన పండ్లలో నేరుడు (జామున్) ప్రముఖమైనది. తక్కువ కేలరీలు కలిగిన ఈ పండు బరువు తగ్గే ప్రక్రియకు తోడ్పడటంతో పాటు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. దీని వలన క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలు, డయాబెటిస్‌ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశముంది.

Java Plum Seeds – విత్తనాల వినియోగం కూడా ఆరోగ్యానికి ఉపయుక్తం

పండ్లతో పాటు నేరుడు విత్తనాలు (Java Plum Seeds) కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాలను పొడి రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి సహజమైన మద్దతు లభిస్తుంది. వీటిలో జాంబోలిన్‌, జాంబుసిన్‌ వంటి సహజ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో పిండి పదార్థాలను చక్కెరగా మార్చే ప్రక్రియను మందగిస్తాయి. ఫలితంగా రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

వినియోగ విధానం

నేరుడు విత్తనాల పొడిని (Java Plum Seeds) రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ మోతాదులో గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. అదేవిధంగా స్మూతీలు, ఓట్స్‌, మజ్జిగ వంటివాటిలో కలిపి కూడా సేవించవచ్చు. అయితే, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి డయాబెటిస్‌ మందులు లేదా ఇన్సులిన్‌ తీసుకునే వారు వైద్యుల సలహాతో మాత్రమే దీనిని వినియోగించాలి.

పరిమాణం ఎలా నిర్ణయించాలి?

నేరుడు పండ్లు తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ను కలిగి ఉండటంతో రక్తంలో చక్కెరను వేగంగా పెంచవు. అయినప్పటికీ ప్రతి వ్యక్తి ఆరోగ్య స్థితి వేర్వేరుగా ఉండటంతో వైద్యుల సూచన మేరకే పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసమే. వినియోగించేముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి.

Also Read : Tiger Nuts Surprising Facts : చూడటానికి ఇలా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా..పిడికెడు గింజలతో ఎన్ని లాభాలో

Exit mobile version