Janasena : అమరావతి – జనసేనాని సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా పేరు పెట్టామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుందన్నారు. జనసేన పార్టీ (Janasena) జన సైనికుల పోరాటాలు, వీర మహిళల తెగింపుతో ముందుకు నడుస్తున్న పార్టీ అని పేర్కొన్నారు. జనసేన పార్టీకి మొదటి నుంచి వారే మూలధనం. గురువారం నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశాల్లో ప్రతి ఒక్క కార్యకర్తను గౌరవించుకోవాలని, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారితో మమేకం కావాలని జనసేన పార్టీ (Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు చెప్పారు మనోహర్.
Janasena Meeting Updates
30వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాబోయే క్రియాశీలక కార్యకర్తలతో ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా జరగబోయే సభ ప్రాంగణానికి మన్యం వీరుడు పేరు ఖరారు చేశామన్నారు. సభా ప్రాంగణానికి వచ్చే ఐదు ప్రధానమైన ద్వారాలకు ఉత్తరాంధ్ర ప్రాంత మహనీయుల పేర్లను పెట్టామన్నారు. తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గున్నమ్మ, మహాకవి శ్రీ శ్రీ పేర్లను పవన్ కళ్యాణ్ ఖరారు చేశారని తెలిపారు మనోహర్.
గురువారం ఉదయం జనసేన పార్టీ సభ ప్రారంభమైంది. జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 29వ తేదీన సేనతో సేనాని పేరుతో 25 జిల్లాల్లో పార్టీతో మమేకమైన వారితో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సమావేశం అవుతారని పేర్కొన్నారు. దీనిలోనే మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల నుంచి వచ్చే యువతతో ముచ్చటిస్తారన్నారు. 30వ తేదీన ఇందిరా ప్రియదర్శిని మైదానంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం ఉంటుందన్నారు. ఇప్పటికే సమావేశానికి ఆహ్వానించే వారికి డిజిటల్ పాసులను పంపించామన్నారు. అలాగే మ్యాన్యువల్ పాసులను కూడా అందజేస్తామన్నారు.
Also Read : CM Chandrababu Interesting : రూ.30 కోట్లతో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్
