తల్లుల ఖాతాలో రూ. 10,120 కోట్లు జ‌మ‌

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత

hellotelugu-Savitha

శ్రీ స‌త్యసాయి జిల్లా : తమ ఇళ్ల ముందు రోడ్లు కూడా వేసుకోలేని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపైనా, తమపైనా విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నేడు తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా రూ.10,120.78 కోట్లను 42,70,802 మంది తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. విద్యా మిత్ర కిట్లను కూడా ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఎంజేపీ గురుకులాల్లో క్రీడల అభివృద్ధి కోసం స్పోర్ట్స్ కిట్లు కూడా పంపినీ చేశామని మంత్రి సవిత తెలిపారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నసన్నకోట బీసీ బాలకల గురుకులాన్ని జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం విద్యాకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అంతకు ముందు బీసీ గురుకుల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సవితకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version