CM Chandrababu : విజయవాడ – విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించానని చెప్పారు. విజయవాడ సితార సెంటర్‌లో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహా గణపతిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు ..దేశంలో ప్రజలంతా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయకచవితి అని అన్నారు. గణేష్ చతుర్థతి అంటే తనకు నాకు చాలా ఇష్టమని, చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్లమని అన్నారు. డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహించినట్టే తామూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే వారమని సీఎం అన్నారు.
CM Chandrababu Key Comments
గత ప్రభుత్వంలో గణేశ్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్నీ విఘ్నాలే ఉండేవన్నారు. పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికీ అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారన్నారు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ మండపాలు నిర్వహించుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. అంతే కాకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.30 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
Also Read : AP Cyclone Sensational – Red Alert : వర్షాల ఎఫెక్ట్ అంతటా రెడ్ అలర్ట్
