జ‌న నాయ‌గ‌న్ కోసం మ‌లేషియాలో అట్లీ

కీల‌క పాత్ర‌లు పోషించిన విజ‌య్, పూజా హెగ్డే

hellotelugu-DirectorAtlee

మ‌లేషియా : భార‌తీయ సినీ రంగంలో టాప్ లో కొన‌సాగుతున్న హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను తాజాగా న‌టించిన చిత్రం జ‌న నాయ‌గ‌న్. ఇందుకు సంబంధించిన ఆడియో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. దీనిని ప్ర‌త్యేకంగా మలేషియాలో రిలీజ్ చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే జ‌న నాయ‌గ‌న్ కు సంబంధించి ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది సోష‌ల్ మీడియాలో. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమాల‌న్నీ బిగ్ స‌క్సెస్ అయ్యారు. 2016లో వ‌చ్చిన తేరి, 2017లో రిలీజ్ అయిన మెర్స‌ల్ , 2019లో వ‌చ్చిన బిగిల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. కోట్లాది రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టాయి. ఈ ఇద్ద‌రు క‌లిసి తీసిన మూవీస్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. తాజాగా త‌ను కొత్త‌గా టీవీకే పార్టీని ఏర్పాటు చేశారు. విజ‌య్ తో అట్లీకి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. త‌నంటే ద‌ర్శ‌కుడికి అభిమానం కూడా.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం వైర‌ల్ గా మారాడు డైన‌మిక్ ద‌ర్శ‌కుడు అట్లీ. మ‌లేషియా ఎయిర్ పోర్టులో న‌ల్ల ప్యాంట్, తెల్ల‌టి కోటు, స‌న్ గ్లాసెస్ తో స్టైలిష్ గా క‌నిపించాడు. ప‌లువురు ఫ్యాన్స్ ఫోటోలు తీశారు. విజయ్ ఆకర్షణ‌కు తోడు అట్లీ దర్శకత్వ ప్రతిభ కలయిక ప్రేక్షకులను నిలకడగా అలరిస్తూ, వారిని తమిళ సినిమాలోని అత్యంత విజయవంతమైన నటుడు-దర్శకుల ద్వయంగా నిలబెట్టింది. త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ లో కొన‌సాగుతున్నాడు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌న సినీ కెరీర్ లో జ‌న నాయ‌గ‌న్ చివ‌రి చిత్రమ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. సూపర్‌స్టార్ స్వయంగా పాడి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన మూడవ సింగిల్ చెల్ల మ‌గ‌ళే ఇవాళ ముందుకు వ‌చ్చింది. సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

Exit mobile version