Jajula Srinivas Goud Shocking Comments : రాష్ట్ర బంద్ తో చరిత్ర సృష్టించాం : శ్రీ‌నివాస్ గౌడ్

బంద్ ను చూసైనా ప్రభుత్వాలు చట్టాన్ని ఆమోదించాలి

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Hello Telugu - Jajula Srinivas Goud Shocking Comments

Jajula Srinivas Goud : హైద‌రాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ కనీవినీ ఎరుగనిగితో విజయవంతం అయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు ఇచ్చిన మొట్ట మొదటి దిగ్విజయంగా కొనసాగి చరిత్ర సృష్టించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) అన్నారు . ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర బంద్ ఒక ట్రైలర్ మాత్రమేనని, బీసీ రిజర్వేషన్ల కు రాజ్యాంగ బద్ధత కల్పించే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. నిన్నటి రాష్ట్ర బంద్ చూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ ప్రక్రియకను మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Jajula Srinivas Goud Shocking Comments

దీపావళి పండుగ తర్వాత బీసీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. బీసీ బంద్ కు అడగగానే మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, టీజేఎస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, సేవాలాల్ సేన, ఆదివాసి సంఘం, ఆమ్ ఆద్మీ , అరుణోదయ, మావోయిస్టు పార్టీ, శివసేన, ఓయూ విద్యార్థి జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ, బీసీ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ జాగృతి, బీసీ న్యాయవాదులు జేఏసీ, మన ఆలోచన సాధన సమితి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఏపీ బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ, తదితర పార్టీలకు, సామాజిక ఉద్యమ శక్తులకు, ప్రజా సంఘాలకు, మీడియా అధిపతులకు, అలాగే ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు, వర్ధక వాణిజ్య వ్యాపారులకు, పోలీసులకు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read : CM Chandrababu – AP Growth : ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తాం : సీఎం

Exit mobile version