CM Chandrababu : అమరావతి : ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్‌పై కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం పెట్టుబడులు, ఒప్పందాలకే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పరిశ్రమల శాఖామంత్రి టీజీ భరత్, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఈడీబీ అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా భారత పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
CM Chandrababu Key Comments on AP Growth
విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో దావోస్ తరహాలోనే పెట్టుబడిదారులు, పాలసీమేకర్ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెట్టుబడులు, ఎంఓయూలకు మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కోసం కూడా ప్లీనరీ సెషన్లు, బ్రేకవుట్ సెషన్లు నిర్వహించాలని సూచించారు. అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్లలో విధానాలపై మేధో మథనం జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఏఐ ఫర్ గుడ్, సెమీ కండక్టర్స్, ఆరోగ్య రంగం, ఇన్నోవేషన్, ఆర్ అండీ, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ లాంటి అంశాలపై సదస్సులో చర్చించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, చైన్ లింకేజ్‌తో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలపై చర్చించాలన్నారు. లాజిస్టిక్స్ రంగంలో రహదారులు, అంతర్గత జలరవాణా, వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజీలు లాంటి అంశాలతో పాటు అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్‌లో విలువ జోడింపు, స్వచ్ఛ ఆంధ్రా, సర్క్యులర్ ఎకానమీ, పీ4 లాంటి అంశాలపై కూడా చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Also Read : Sabitha Indra Reddy Shocking Comments : గన్ తో బెదిరిస్తే డీజీపీ ఏం చేస్తున్నట్టు..?
