Jajula Srinivas Goud : హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). ఇవాళ బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు గనుక కొట్టేస్తే దానికి బిజెపి పార్టీ ఏ బాధ్యత వహించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా మోసం చేసింది కూడ బిజెపినేనని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ ను కేంద్ర మంత్రులు కలిస్తే గంటలో బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం పొందేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరిగిన బీసీల ఆందోళనలు ఆరంభం మాత్రమేనని ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్ లు ఒక్క శాతం తగ్గిన రాష్ట్రం అగ్నిగుండమే అవుతుందన్నారు.
Jajula Srinivas Goud Slams BJP
హైకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని గత ఇరవై నెలలుగా బీసీ సమాజం ముక్త కంఠంతో కోరుతుంటే బిజెపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. దీనితో రిజర్వేషన్ వ్యతిరేకులు న్యాయస్థానాలను వేదికగా చేసుకొని బీసీల రిజర్వేషన్ల లకు గండి కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు ఒక్క శాతం తగ్గినా ఒప్పుకునేది లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపుమేరకు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చేస్తున్న కుట్రలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read : Minister Savitha Important Update : ఏపీలో నూతన బీసీ గురుకులాల ఏర్పాటు
