Jackfruit Interesting Benefits : పనసపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..

గింజలు, పట్టు కూడా ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి...

Hello Telugu - Jackfruit Interesting Benefits

Hello Telugu - Jackfruit Interesting Benefits

Jackfruit : భారీ పరిమాణంలో కనిపించే పనస పండు (Jackfruit)ను తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తియ్యగా, రుచికరంగా ఉండే పనస తొనలు మాత్రమే కాదు.. దాని గింజలు, పట్టు కూడా ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి.

Jackfruit – పోషకాల వెల్లువ

పనస పండులో (Jackfruit) విటమిన్ C, విటమిన్ A, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక మైక్రోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

ఇమ్యూనిటీకి బలాన్నిచ్చే పండు

పనస పండు రెగ్యులర్‌గా తీసుకుంటే వైరల్ ఫీవర్‌, జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తగ్గుతుంది. గట్ హెల్త్ మెరుగుపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్‌

ఫ్యాట్‌, కేలరీలు తక్కువగా ఉండే పనస పండు తినడం వల్ల పెరిగిన ఆకలి అదుపులోకి వస్తుంది. ఎక్కువ సేపు తృప్తిగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక.

బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయం

పనసలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కలిసి హార్ట్ హెల్త్‌కు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మానికి గ్లో, వృద్ధాప్యాన్ని అడ్డుగా

పనసలోని విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మానికి మెరుపును అందిస్తూ, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది.

డయాబెటిక్ పేషెంట్‌లకు లాభం

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పనస పండు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచగలదు.

ఎముకల బలం, కంటి చూపు మెరుగుపడటానికి

పనసలోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె ఎముకలకు బలం ఇవ్వడమే కాక, విటమిన్ A, కారోటెనోయిడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పర్యావరణ హితమైన పండు

పనస పండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసే పండుగా గుర్తింపు పొందింది. అందుకే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దీనిని ప్రమోట్ చేస్తున్నారు.

గమనిక: ఈ వ్యాసంలోని సమాచారం వైద్య నిపుణుల సూచనల ఆధారంగా, అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, సరైన వైద్యులను సంప్రదించడం మేలైనది.

Also Read : Avoid Sugar – Interesting Benefits : 30 రోజులు షుగర్ మానేయడం వల్ల ఆరోగ్యం లో ఎన్ని పరుపులు వస్తాయో..

Exit mobile version