Avoid Sugar : తినే ఆహారంలో అధిక చక్కెర లేదా ఉప్పు తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సాధారణంగా చెక్కెరను పరిమితంగా తీసుకుంటే అది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. కానీ దీన్ని అధికంగా తీసుకుంటే మాత్రం శరీరంపై దుష్ఫలితాలు చూపుతాయి. అయితే, ఒక నెల పాటు పూర్తిగా చక్కెర (Avoid Sugar) తినడం మానేస్తే శరీరంలో కొన్ని స్పష్టమైన, ఆరోగ్యకరమైన మార్పులు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Avoid Sugar – అవేంటో తెలుసుకుందాం:
1. కాలేయ ఆరోగ్యానికి మేలు
ప్రాసెస్డ్ చక్కెరలో (Sugar) ఉండే ఫ్రక్టోజ్ లివర్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ, చక్కెర తీసుకోవడం మానేసిన ఒక నెలలోనే లివర్‌లోని కొవ్వు నెమ్మదిగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
2. మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది
అధిక చక్కెర తీసుకోవడం మూత్రపిండాలపై భారం వేస్తుంది. ముఖ్యంగా ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉండటంతో మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. కానీ, చక్కెర మానేసిన తర్వాత అవి తిరిగి సమర్థవంతంగా పనిచేయడం మొదలవుతుంది.
3. గుండె ఆరోగ్యానికి మేలు
చక్కెర వల్ల ధమనుల గోడలపై వాపు ఏర్పడి, రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌కి దారితీస్తుంది. నెల రోజులపాటు చక్కెర లేకుండా ఉండటం వల్ల ఈ వాపు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
4. రోగనిరోధక శక్తి బలపడుతుంది
చక్కెర తినడం వల్ల తెల్ల రక్త కణాల పనితీరు మందగిస్తుంది. కానీ, చెక్కెర మానేసిన తర్వాత శరీరం మిక్రోన్యూట్రియెంట్లను (క్యాల్షియం, మెగ్నీషియం, జింక్) బాగా అబ్బోసోర్బ్ చేసుకుంటుంది. వీటి వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
సూచన:
ఈ సమాచారం ఇంటర్నెట్‌లోని ప్రజాదరణ పొందిన వైద్య వనరుల ఆధారంగా రూపొందించబడింది. మీకు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలుంటే, ఆహార మార్పులు చేసేముందు వైద్యుడిని సంప్రదించండి.
సూక్ష్మ మార్పులు, దీర్ఘకాలిక లాభాలు – ఒక్క నెల చక్కెర మానేస్తేనే ఇన్ని ప్రయోజనాలు ఉంటే, దీన్ని జీవితశైలిగా మార్చుకుంటే ఆరోగ్యం ఎంత బాగుపడుతుందో ఊహించగలుగుతారు!
Also Read : Lalit Modi and Vijay Mallya Sensational : నెట్టింట హల్ చల్ అవుతున్న విజయ్ మాల్యా, లలిత్ మోదీ వీడియో
