మీనాక్షి న‌ట‌రాజ‌న్ సీటు కోల్పోవ‌డం విచారం

రాజ్య‌స‌భ ఎంపీ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ

hellotelugu-MeenaakhiNatarajan

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : మీనాక్షి నటరాజన్ లాంటి నిరాడంబరమైన, గొప్ప నాయకురాలు కేవలం అఫిడవిట్‌లోని ఒక చిన్న సాంకేతిక లోపం వల్ల రాజ్యసభ స్థానాన్ని కోల్పోవడం అత్యంత బాధాకరం. ఆమెకున్న నిరుపమానమైన నిజాయతీ, గాంధేయవాద విలువల దృష్ట్యా.. ఒక చిన్న విషయాన్ని ఆమె ఉద్దేశ పూర్వకంగా దాచారనేది ఎవరూ నమ్మలేని నిజం.

చట్టం తన పని తాను చేసుకు పోతుందనేది నిజమే అయినప్పటికీ (WHILE RULE IS RULE).. ఇది తెలంగాణ అగ్ర నాయకత్వం కనుసన్నల్లో జరిగిన పార్టీ అంతర్గత రాజకీయ కుట్రల వల్ల ఆమెను రాజకీయంగా బలిచేసిండ్రని తెలుస్తోంది. ఇది చాలా విచారకరం . గతంలో కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రభుత్వం డిక్టేటర్ హిట్లర్ (నిరంకుశ) పోకడలను సరిదిద్దడానికి ఆమె ప్రయత్నించినప్పుడు.. ఇదే తెలంగాణ అగ్ర నాయకత్వం తమ సొంత మీడియా సంస్థల ద్వారా ఆమెను టార్గెట్ చేసింది.

ఈ రోజుల్లో రాజ్యసభ కేవలం పెట్టుబడిదారుల అడ్డాగా మారుతున్న తరుణంలో, ఆమె లాంటి ఆదర్శవాది సభలో లేక పోవడం దేశానికి తీరని లోటు. నేడు మనకు కావాల్సింది కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్నవారు కాదు, నిఖార్సైన నిజాయతీ గల ప్రజల పక్షాన పోరాడే గొంతుకలు. భారత పార్లమెంట్ ఒక నిజమైన క్షేత్రస్థాయి (grass root) ఆదర్శ వాదిని కోల్పోయింది. మీనాక్షి నిరాశపడకండి.. సిద్ధాంతాల కోసం మీరు చేసే పోరాటం ఎప్పటికీ ఆగకూడదని కోరుకుంటూ ‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’!

Exit mobile version