ISRO New Innovation : ఇకపై టవర్ లేకుండా ఇంటర్నెట్ అంటున్న ఇస్రో

అరణ్య ప్రాంతాల్లో కూడా మొబైల్ సిగ్నల్, హై–స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Hello Telugu - ISRO New Innovation

Hello Telugu - ISRO New Innovation

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఎల్‌వీఎం–3ఎం మార్క్–5 (బాహుబలి రాకెట్) ద్వారా అమెరికాలో తయారైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశంలోని లోయలు, కొండలు, దూరప్రాంతాలు, అరణ్య ప్రాంతాల్లో కూడా మొబైల్ సిగ్నల్, హై–స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ISRO – ప్రయోగ సమయం

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో అక్టోబర్ రెండవ వారంలో ఈ ప్రయోగం జరగనుంది. రాకెట్ అనుసంధానం పనులు తుది దశలో ఉన్నాయి. అక్టోబర్ 15 నుండి 19 మధ్యలో ప్రయోగం జరగనున్నట్లు ఇస్రో (ISRO) వర్గాలు వెల్లడించాయి.

ప్రయోగించనున్న ఉపగ్రహం

ఈసారి ప్రయోగించబోయే CMS–02 కమ్యూనికేషన్ ఉపగ్రహం బరువు సుమారు 6,500 కిలోలు. అమెరికా టెక్సాస్‌కు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లాక్–2 బ్లూ బర్డ్ శ్రేణికి చెందిన ఈ ఉపగ్రహం, ఈ నెలాఖరులోగా భారత్‌కు చేరుకోనుంది.

ప్రత్యేకతలు

ఉపగ్రహం ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా కనెక్టివిటీ లభిస్తుంది.

మొబైల్ వినియోగదారులు ఇకపై భూమిపై ఉండే టవర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

దూరప్రాంతాలు, కొండల్లో కూడా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ సాధ్యం కానుంది.

దేశానికి లాభాలు

ఈ ప్రయోగం విజయవంతమైతే, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలు, అరణ్యాలు, సరిహద్దు ప్రాంతాల వరకు ఆధునిక కమ్యూనికేషన్ సేవలు చేరతాయి. ఇప్పటివరకు ఇస్రో అనేక కమ్యూనికేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినప్పటికీ, CMS–02 పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

ఇస్రో లక్ష్యం

ఈ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనికేషన్ రంగాన్ని మరింత విస్తృతం చేయడం, దేశంలో డిజిటల్ కనెక్టివిటీని కొత్త స్థాయికి తీసుకెళ్లడమే ఇస్రో ప్రధాన ఉద్దేశ్యం. ప్రయోగ ఖచ్చితమైన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Also Read : Infosys New Innovation : ఉద్యోగం మానేసిన మహిళలకు ‘ఇన్ఫోసిస్’ మంచి అవకాశం

Exit mobile version