చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని జోష్యం చెప్పారు. ఈ విషయాన్ని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. అరిగి పోయిన పాత రికార్డ్ ఫోన్ లా. అసలు ఎందుకు కూటమి సర్కార్ ను కూలదోయాలని అనుకుంటున్నారనేది ఇప్పుడు చర్చకు దారి తీసేలా చేసింది. తమిళనాడులో (విజయ్ పార్టీ)కి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఏకమయ్యాయి. ఇప్పటి వరకు ఎటువంటి పెద్ద తప్పులూ చేయని ఈ సమర్థవంతమైన ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకోవడం పట్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉండగా 1980లో తన ప్రభుత్వం రద్దయిన తర్వాత ఎంజీ రామచంద్రన్ ఎలాగైతే ప్రజల ముందుకు వెళ్లారో, అగ్ర నటుడు విజయ్ కూడా అలాగే ప్రజల ముందుకు వెళ్లి ఇలా “నేను చేసిన తప్పేంటి?” అని అడగాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్నా లేకపోయినా, ఆయన భారీ మెజారిటీతో తిరిగి ఎన్నికవుతారని పెద్ద ఎత్తున నమ్ముతున్నారు టీవీకే కార్యకర్తలు, నేతలు. అప్పుడు ఆయన ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వాన్ని అందించగలరు. ఒకవేళ ఆయన ప్రభుత్వం పెద్దగా తప్పులేమీ చేయకపోతే, బహుశా మరో ఐదేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు.
ఇక విజయ్ ఓట్ల శాతం గురించి, సాధారణ మెజారిటీ సాధించ లేక పోవడం గురించి, ఇతర పార్టీల నుండి ఆయనకు లభించే మద్దతు గురించి వాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. DMK ఓటమి వల్ల కలిగిన షాక్ నుండి వాళ్లు ఇంకా తేరుకోలేదని అనిపిస్తోంది. తమిళనాడులో ఎన్నికలు జరిగితే బాగుంటుంది. అప్పుడు నిజమైన ‘మాస్ లీడర్’ (ప్రజా నాయకుడు) ఎవరో కూడా తేలి పోతుంది.
