Intel : ముంబై : దిగ్గజ ఇంటెల్ సంస్థ పెట్టుబడుల సమీకరణ లేదా భాగస్వామ్యంపై దృష్టి సారించింది. ఈ మేరకు టీఎస్ఎంసీని సంప్రదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో కంపెనీపై ఆసక్తి చూపడానికి ముందే బయటి పెట్టుబడిని పొందడానికి ఇంటెల్ (Intel) ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇంటెల్ తయారీ లేదా భాగస్వామ్యాలలో పెట్టుబడుల గురించి తైవాన్ సెమీ కండక్టర్ తయారీ కంపెనీని సంప్రదించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ మేరకు నివేదించింది. కాగా కష్టాల్లో ఉన్న చిప్‌మేకర్‌లో పెట్టుబడిని పొందడం గురించి ఇంటెల్ ఆపిల్‌తో చర్చలు జరుపుతోందని విశ్వసనీయ సమాచారం. 10 శాతం వాటాను తీసుకకుంది. అయితే ఇంటెల్ , టీఎస్ఎంసీ కంపెనీలు ఒప్పందం చేసుకునే విషయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.
Intel Focus
ఎన్విడియా కంపెనీలో దాదాపు 4 శాతం వాటా కోసం ఇంటెల్‌లో 5 బిలియన్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఆగస్టులో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ నుండి చిప్ మేకర్‌కు 2 బిలియన్ల మూలధన ఇంజెక్షన్ కూడా లభించింది. ఇంటెల్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి లిప్-బు టాన్ చిప్‌మేకర్‌ను తిరిగి ప్రారంభించడానికి భాగస్వాములను తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో సిలికాన్ ను ఉంచినట్లు చెప్పుకునే చిప్ పరిశ్రమ జెండా బేరర్ అయిన ఇంటెల్ టెక్నాలజీ పరంగా దుమ్ము రేపుతూ ముందుకు సాగుతోంది ఆర్టిఫిషఙయల్ ఇంటెలిజెన్సీ (ఏఐ). కాగా ఏఐ రేసులో పోటీ పడేందుకు చాలా కష్ట పడుతోంది ఇంటెల్. కాగా కొత్త కంపెనీలో టీఎస్ఎంసీ 20 శాతం వాటాను తీసుకుంటుందని సమాచారం.
Also Read : Hyderabad Heavy Rains Sensational : హైదరాబాద్ ను ముంచెత్తిన వాన
