Heavy Rains : హైదరాబాద్ : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం దెబ్బకు వర్షాలు పెద్ద ఎత్తున ముంచెత్తుతున్నాయి. దంచి కొడుతున్న వర్షాల తాకిడికి హైదరాబాద్ తల్లడిల్లుతోంది. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ చేయడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాల (Heavy Rains) తాకిడికి రహదారులు జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి నుండి నిరంతరాయంగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Hyderabad Heavy Rains Sensational
ప్రయాణికులు నీటితో నిండిన రహదారి గుండా వెళుతున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. తుఫాను గరిష్ట ప్రభావంతో పాటు రోజంతా ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని సలహా ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, సజావుగా అత్యవసర సేవలను నిర్ధారించడానికి ఇంటి నుండి పని చేసే ఏర్పాట్లను పరిగణించాలని అధికారులు సంస్థలకు సూచించారు. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Also Read : Russia Deputy PM Interesting Comments : భారత్, రష్యాల మధ్య బంధం బలోపేతం
