ఇంద్ర‌కీలాద్రిలో అంత‌రాల‌య ద‌ర్శ‌నం నిలిపివేత‌

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఆల‌య కార్య నిర్వ‌హ‌ణ అధికారి

hellotelugu-Indrakeeladri

విజ‌య‌వాడ : సంక్రాంతి పండుగ వేళ విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి దుర్గ గుడికి పెద్ద ఎత్తున భ‌క్తులు పోటెత్తారు. ఇదిలా ఉండ‌గా రద్దీ వేళల్లో అంతరాలయ దర్శనం నిలిపి వేస్తున్న‌ట్లు తెలిపారు ఆల‌య ఈవో. సాధారణ భక్తులు గంటల తరబడి పొడవైన క్యూలలో వేచి ఉండకుండా, సాఫీగా నిర్ణీత సమయంలో దర్శనం చేసుకునేలా చూడటమే ప్రధాన లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. రద్దీని తగ్గించి, సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కల్పించే చర్యలో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో వారాంతాలు , సెలవు దినాలలో రద్దీ వేళల్లో అంతరాలయ దర్శనాన్ని నిలిపి వేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ గురువారం మాట్లాడారు మీడియాతో .

నిరంతరం పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ యాత్రికులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులు గంటల తరబడి పొడవైన క్యూలలో వేచి ఉండకుండా, నిర్ణీత సమయంలో దర్శనం చేసుకునేలా చూడటమే ప్రధాన లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు నాయ‌క్. ఇదిలా ఉండ‌గా దేవాదాయ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఆలయ పరిపాలన దర్శన షెడ్యూల్‌ను సవరించింది. దీని ప్రకారం, శుక్ర, శని, ఆదివారాలతో పాటు పండుగ రోజులు, శుభ సందర్భాలు , ప్రభుత్వ సెలవు దినాలలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంతరాలయ దర్శనం నిలిపి వేయనున్న‌ట్లు వెల్ల‌డించారు ఈవో. ఈ సమయంలో రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్లు జారీ చేయ‌డం జ‌ర‌గ‌ద‌న్నారు.

Exit mobile version