Indian Railways : ప్రయాణానికి ముందుగా రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, అనుకోని కారణాల వల్ల ప్రయాణం చేయలేకపోయే పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో టికెట్‌ను రద్దు చేయకుండానే భారతీయ రైల్వే (Indian Railways) ప్రత్యేక నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
Indian Railways – ఎవరు అర్హులు?
రైల్వే నియమాల ప్రకారం ఈ సౌకర్యం కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది.
- తల్లిదండ్రులు
- భార్యాభర్తలు
- తోబుట్టువులు
- పిల్లలు
అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు తమ శాఖ నుండి వ్రాతపూర్వక అనుమతి పొందిన పక్షంలో కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఒక టికెట్‌పై బదిలీ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది.
టికెట్ మార్పు విధానం
- ఈ ప్రక్రియ ఆన్లైన్లో లభించదు.
- టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్నా, తప్పనిసరిగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్లాలి.
- రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందుగా కౌంటర్లో టికెట్ సమర్పించాలి.
- అసలు ప్రయాణికుడు మరియు కొత్త ప్రయాణికుడి ఆధార్, పాన్ వంటి గుర్తింపు పత్రాలను చూపించాలి.
- ఈ సౌకర్యం కన్ఫార్మ్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ లేదా RAC టికెట్లపై ఇది అమలు కాదు.
ప్రక్రియ పూర్తయిన తర్వాత
అవసరమైన పత్రాలను పరిశీలించిన అనంతరం రైల్వే సిబ్బంది టికెట్‌పై కొత్త పేరును నమోదు చేసి, రిసీప్ట్ లేదా సవరించిన టికెట్‌ను జారీ చేస్తారు.
ఈ విధానంతో టికెట్ రద్దు చేయాల్సిన అవసరం లేకుండా, క్యాన్సిల్ ఫీజు చెల్లింపు నుంచి ప్రయాణికులు తప్పించుకోవచ్చు. దీంతో ప్రయాణం మరింత సులభంగా కొనసాగుతుంది.
Also Read : ICICI Bank Huge Discount : పండుగ సీజన్‌కి ఐసీఐసీఐ బ్యాంక్ భారీ ఆఫర్లు
