ICICI Bank Huge Discount : పండుగ సీజన్‌కి ఐసీఐసీఐ బ్యాంక్ భారీ ఆఫర్లు

డైనింగ్ వంటి విభాగాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది...

Hello Telugu - ICICI Bank Huge Discount

Hello Telugu - ICICI Bank Huge Discount

ICICI Bank : పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఐసీఐసీఐ బ్యాంక్ తమ వార్షిక ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులు రూ.50,000 వరకు తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ట్రావెల్, కిరాణా, ఫర్నిచర్, డైనింగ్ వంటి విభాగాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది.

క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్‌లెస్ ఈఎంఐ, కన్స్యూమర్ ఫైనాన్స్‌ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ICICI Bank – ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం

ఈ ఆఫర్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఆపిల్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, వన్‌ప్లస్, మేక్‌మైట్రిప్, గోయిబిబో, యాత్ర, బ్లింకిట్, స్విగ్గీ, అజియో, పెప్పర్‌ఫ్రై వంటి ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఐసీఐసీఐ (ICICI Bank) కస్టమర్లు అదనంగా 10% తగ్గింపు పొందవచ్చు.

ముఖ్యమైన ఆఫర్లు

రుణాలపై ప్రత్యేక పండుగ ఆఫర్లు

బ్యాంక్ వ్యాఖ్య

ఈ ఆఫర్లపై ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా మాట్లాడుతూ –
“కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పండుగ ఆఫర్లను రూపొందించాం. సమీపంలోని బ్రాంచ్ లేదా ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని ఆఫర్లకు నిబంధనలు వర్తిస్తాయి,” అని తెలిపారు.

Also Read : GST 2025 Reforms Growth : జీఎస్‌టీ 2.0 సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి

Exit mobile version