Huge Gold Seized : గడిచిన 10 ఏళ్లుగా వేల కేజీల బంగారాన్ని సీజ్ చేసిన కేంద్ర సర్కార్

ఈ స్వాధీనం చేసిన పసిడి విలువ అంచనాల ప్రకారం దాదాపు ₹32 వేల కోట్లు...

Hello Telugu - Huge Gold Seized

Hello Telugu - Huge Gold Seized

Gold : దేశంలో అక్రమ బంగారం రవాణా స్థాయిని చూపించే గణాంకాలు వెలువడ్డాయి. కేంద్ర ఆర్థికశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, గత 2015 నుండి 2025 మధ్యకాలంలో మొత్తం 31,772.34 కిలోల బంగారం అధికారుల చేతికి చిక్కింది. ఈ స్వాధీనం చేసిన పసిడి విలువ అంచనాల ప్రకారం దాదాపు ₹32 వేల కోట్లు.

Gold – సంవత్సరం వారీగా కేసులు – స్వాధీనం చేసిన బంగారం (కిలోల్లో)

2015–16: 2,815 కేసులు – 2,972.07 కిలోలు

2016–17: 1,573 కేసులు – 1,520.24 కిలోలు

2017–18: 3,131 కేసులు – 3,329.46 కిలోలు

2018–19: 5,092 కేసులు – 4,292.29 కిలోలు

2019–20: 4,784 కేసులు – 3,626.85 కిలోలు

2020–21: 2,034 కేసులు – 1,944.39 కిలోలు

2021–22: 2,236 కేసులు – 2,172.11 కిలోలు

2022–23: 4,619 కేసులు – 4,342.85 కిలోలు

2023–24: 6,599 కేసులు – 4,971.68 కిలోలు (అత్యధికం)

2024–25: 3,005 కేసులు – 2,600.40 కిలోలు

స్వాధీనం అయిన బంగారం విలువ

పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు పట్టుబడిన బంగారాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు అప్పగిస్తాయి. సక్రమ పత్రాలు ఉన్నప్పుడు యజమానులకు తిరిగి ఇస్తారు. అయితే గత పదేళ్లలో స్వాధీనం అయిన బంగారంలో ఎక్కువ భాగం ఓనర్లే క్లెయిమ్ చేయకపోవడంతో, అది ప్రభుత్వ భాండాగారాల్లోనే నిల్వ అయింది. దీని మార్కెట్ విలువ దాదాపు ₹32,000 కోట్లకు చేరుకుంటుంది.

నిపుణుల విశ్లేషణ

కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, స్వాధీనం అయిన బంగారం పరిమాణం పెరగడం గమనార్హం. దీనికి అంతర్జాతీయ బంగారం ధరలు, రవాణా మార్గాల మార్పులు, తనిఖీల కఠినత వంటి అంశాలు కారణమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Today Gold Price : స్వల్ప తగ్గుదల తో నడుస్తున్న పసిడి ధరలు

Exit mobile version