Gooseberry : ఆయుర్వేద, యునానీ వంటి పద్ధతుల్లో విస్తృతంగా వినియోగించే ఉసిరిలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, పీచు పదార్థం, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంపు, జీర్ణక్రియ మెరుగుదల, చర్మ ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఉసిరి (Gooseberry) అందరికీ సమానంగా అనుకూలం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Gooseberry – డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారికి జాగ్రత్తలు
ఉసిరిలోని పాలీఫీనాల్స్ ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. దీని వలన రక్తంలో చక్కెర స్థాయి పడిపోవచ్చు. ఇప్పటికే హైపోగ్లైసీమియా ఉన్నవారు ఉసిరి తింటే తల తిరగడం, అలసట, కన్ఫ్యూజన్ లేదా మూర్ఛ వంటి సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కడుపు సమస్యలతో బాధపడేవారికి పరిమితి అవసరం
విటమిన్ సీ అధికంగా ఉండటంతో ఉసిరికి (Gooseberry) ఆమ్ల గుణం ఎక్కువ. యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్స్ లేదా కడుపు నొప్పి ఉన్నవారు దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు మరింత పెరిగే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బ్లడ్ థిన్నర్స్ వాడేవారికి ప్రమాద సూచన
ఉసిరిలో రక్తాన్ని పలుచగా చేసే గుణాలు ఉండటంతో, ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్, వార్ఫేరిన్ వంటి మందులు వాడుతున్నవారు దీన్ని అధికంగా తినకూడదు. ఇలా చేస్తే రక్తస్రావం ముప్పు పెరుగుతుంది. సర్జరీ తరువాత కూడా ఉసిరిని దూరంగా ఉంచడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి
ఉసిరిలోని విటమిన్ సీ శరీరంలో ఆక్సాలేట్ అనే పదార్థంగా మారుతుంది. దీని వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కిడ్నీ వ్యాధిగ్రస్తులు దీన్ని పరిమితంగా తీసుకోవాలి.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తలు పాటించాలి
గర్భిణీలు పచ్చి ఉసిరి తీసుకుంటే జీర్ణ సమస్యలు, మోషన్‌లు రావచ్చని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల వీరు కూడా ఉసిరిని మితంగా తీసుకోవాలి.
అలర్జీ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి
అలర్జీలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, దురదలు లేదా చర్మంపై ర్యాష్‌లు వచ్చే వారికి ఉసిరి సమస్యలు కలిగించవచ్చు. కాబట్టి అలర్జీ ఉన్నవారు దీన్ని మానుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.
Also Read : Banana with Black Pepper Interesting : అరటిపండు పై మిరియాల పొడి తింటే అంత మంచిదా?
