RSS Chief Important Comments : భార‌తీయ సంస్కృతి ప్ర‌త్యేక‌మైన‌ది : ఆర్ఎస్ఎస్ చీఫ్

యునైటెడ్ కింగ్ డ‌మ్ విభ‌జ‌నను ఎదుర్కొంటోంది

Hello Telugu - RSS Chief Important Comments

Hello Telugu - RSS Chief Important Comments

RSS Chief : ఇండోర్ : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ (RSS Chief) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా యునైటెడ్ కింగ్ డ‌మ్ (యుకె) ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా అది విభ‌జ‌న‌ను ఎందుకు ఎదుర్కొంటోంద‌ని ప్ర‌శ్నించారు. దీని వెనుక విచ్చిన్న‌మై పోతున్న సంస్కృతే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. యునైటెడ్ ఇండియా విన్స్టన్ చర్చిల్ చేసిన ప్ర‌తిపాద‌న తప్పు అని నిరూపించిందన్నారు. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత కూడా ఐక్యంగా ఉండటం ద్వారా భారతదేశం తన స‌త్తా ఏమిటో యావ‌త్ ప్ర‌పంచానికి తెలియ చెప్పింద‌న్నారు మోహ‌న్ భ‌గ‌వ‌త్. ఈ సంద‌ర్భంగా అన్ని దేశాల‌లో కంటే భార‌తీయ సంస్కృతి, నాగ‌రిక‌త భిన్న‌మైద‌ని, ప్ర‌త్యేక‌మైన‌ద‌ని తెలియ చెప్పింద‌న్నారు.

RSS Chief Key Comments

జ్ఞానం, చర్య, భక్తి సాంప్రదాయ తత్వ శాస్త్రంపై విశ్వాసం ద్వారా భారతదేశం నడపబడుతున్నందున అందరి అంచనాలను తప్పుగా నిరూపించడం ద్వారా అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్ప‌ష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన 7.80 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు. ఇది అమెరికా సుంకాలు విధించే ముందు గత ఐదు త్రైమాసికాల్లో అత్యధికంగా ఉంద‌న్నారు. మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాసిన ‘పరిక్రమ కృపా సార్’ పుస్తకాన్ని ఇండోర్‌లో విడుదల చేశారు. ఈ సంద‌ర్బంగా మోహ‌న్ భ‌గ‌వ‌త్ ప్ర‌సంగించారు. భారతదేశం 3,000 సంవత్సరాలు ప్రపంచానికి నాయకత్వం వహించినప్పుడు ప్రపంచ కలహాలు లేవని అన్నారు.

ఆ సమయంలో పర్యావరణం ఎప్పుడూ క్షీణించ లేద‌న్నారు. సాంకేతిక పురోగతి ఉన్నత స్థాయిలో ఉందన్నారు. మానవ జీవితం సంతోషంగా, సంస్కారవంతంగా ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోని అన్ని సమస్యలను సృష్టించిన సంఘర్షణలకు వ్యక్తిగత ప్రయోజనాలే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్ప‌స్టం చేశారు.

Also Read : Great Mokshagundam Visvesvaraya : విశ్వేశ్వర‌య్య జీవితం స్పూర్తి దాయ‌కం

Exit mobile version