Great Mokshagundam Visvesvaraya : విశ్వేశ్వర‌య్య జీవితం స్పూర్తి దాయ‌కం

ఆయ‌న‌కు ప్ర‌ధాని మోదీ ఘ‌న నివాళులు

Hello Telugu - Great Mokshagundam Visvesvaraya

Hello Telugu - Great Mokshagundam Visvesvaraya

Mokshagundam Visvesvaraya : న్యూఢిల్లీ : భార‌త దేశ వ్యాప్తంగా సోమవారం ఇంజనీర్ల దినోత్సవం నిర్వ‌హిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంజ‌నీర్స్ డే సంద‌ర్బంగ సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు . విక‌సిత్ భార‌త్ ను నిర్మించేందుకు భావి భార‌త ఇంజ‌నీర్లు కీల‌క పాత్ర పోషించాల‌ని పిలుపునిచ్చారు. ఈదేశ నిర్మాణంలో, ప్రాజెక్టుల‌ను రూపు దిద్ద‌డంలో ఎంద‌రో త‌మ‌వంతు కృషి చేశార‌ని గుర్తు చేసుకున్నారు. ఇదే స‌మ‌యంలో సమిష్టి ప్రయత్నాలలో వారు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఈ దినోత్సవాన్ని ఇంజనీర్ల సహకారానికి నివాళిగా , ప్రముఖ సివిల్ ఇంజనీర్ ఎం. విశ్వేశ్వరయ్య (Mokshagundam Visvesvaraya) జన్మదినాన్ని స్మరించుకునేందుకు కూడా జరుపు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు.

Mokshagundam Visvesvaraya Anniversary

చిన్న త‌నంలోనే తండ్రిని కోల్పోయినా ఎక్క‌డా త‌ల వంచ‌కుండా ప‌ట్టుద‌ల‌తో చ‌దివిన చ‌రిత్ర విశ్వేశ్వ‌ర‌య్య‌ద‌ని పేర్కొన్నారు మోదీ. ఆ త‌ర్వాత ఇంజ‌నీర్ గా ఆయ‌న చేసిన కృషి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఆయ‌న వ‌ల్ల ఎన్నో ప్రాజెక్టులు రూపు దిద్దుకున్నాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న లేక పోయినా ఆయ‌న సృష్టించిన జ‌లాశ‌యాలు నేటికీ వేలాది మందిని ర‌క్షిస్తున్నాయ‌ని, కోట్లాది మందికి దాహార్తిని తీరుస్తున్నాయ‌ని, ఇదంతా ఆయ‌న చేసిన కృషి వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు ప్ర‌ధాని.

Also Read : Great Mokshagundam Anniversary : స‌ర్ మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి

Exit mobile version