Solar Energy – India Growth : సౌరశక్తి ఉత్పత్తిలో జపాన్ ను అధిగమించిన భారత్

ఈ విషయాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా వెల్లడించారు...

Hello Telugu - Solar Energy - India Growth

Hello Telugu - Solar Energy - India Growth

Solar Energy : భారతదేశం ప్రపంచ సౌరశక్తి రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. జపాన్‌ను వెనక్కునెట్టి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా వెల్లడించారు.

అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (IRENA) తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఉదహరించిన మంత్రి, భారత్ ఇప్పటివరకు 1,08,494 గిగావాట్ గంటలు (GWh) సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా, జపాన్ 96,459 GWh మాత్రమే ఉత్పత్తి చేసిందని వివరించారు.

Solar Energy – ప్రధాని మోదీ నేతృత్వానికి కితాబు

ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తీసుకువెళ్లిన శుద్ధ ఇంధన విధానాల ఫలితంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ ఫ్యూయెల్ విద్యుత్ సామర్థ్య లక్ష్యం సాధన దిశగా భారత్ కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఇది కేవలం ఇంధన భద్రతకు మాత్రమే కాకుండా, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా కీలక అడుగుగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

చైనా ఆధిపత్యం కొనసాగుతోంది

IRENA 2024 గణాంకాల ప్రకారం, చైనా మాత్రం ఈ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2023లో చైనా 260 గిగావాట్ల సౌర శక్తిని ఉత్పత్తి చేసింది. ఇది 2022తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. 2022లో అమల్లోకి వచ్చిన 14వ పునరుత్పాదక ఇంధన ప్రణాళికతో చైనా దీని అమలుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

గ్లోబల్ శుద్ధ ఇంధనంలో భారత్ భవిష్యత్

భారతదేశం శుద్ధ ఇంధన రంగంలో తన స్థానం మరింత బలపరుస్తున్న వేళ, ఈ అభివృద్ధి పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు బలమైన పునాది వేసింది. సౌరశక్తిలో (Solar Energy) ప్రపంచ మూడవ స్థానం సాధించడం ద్వారా భారత్, శుభ్రమైన భవిష్యత్తు కోసం ప్రపంచానికి ఒక మార్గదర్శక దేశంగా నిలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read : LPG Cylinder Price Interesting : నేటి నుంచి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

Exit mobile version