India 3rd Largest : మూడవ అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ

Hello Telugu - India 3rd Largest

Hello Telugu - India 3rd Largest

India : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ – త్వ‌ర‌లోనే భార‌త దేశం అతి పెద్ద మూడవ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతుంద‌ని అన్నారు ప్ర‌ధాని మోదీ. అభివృద్ది చెందుతున్న దేశాల‌తో పోటీ ప‌డుతున్నామ‌ని చెప్పారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మోదీ ట్రినిడాడ్, టొబాగోలోని భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల దేశం ముందుకు వెళుతోంద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని చెప్పారు. ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా దేశాన్ని నెట్టుకు వ‌స్తున్నామ‌ని అన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకు వ‌చ్చామ‌న్నారు.

Indian Economy Growth

గత దశాబ్దంలో భారతదేశం (India) 250 మిలియన్లకు పైగా ప్రజలను తీవ్ర పేదరికం నుండి బయట పడేసిందన్నారు. ఈ విష‌యాన్ని ప్రపంచ బ్యాంకు సైతం గుర్తించింద‌ని, ఆ మేర‌కు ప్ర‌శంస‌లు కురిపించింద‌ని తెలిపారు మోదీ. ఈ దేశ అభివృద్దిలో యువ‌త కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని తెలిపారు. అంతే కాకుండా కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ప్ర‌పంచంలోనే ఇండియా మూడో అతి పెద్ద స్టార్ట‌ప్ హ‌బ్ గా ఇప్పుడు కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ స్టార్ట‌ప్ ల‌లో దాదాపు సగం వ‌ర‌కు మ‌హిళ‌లు డైరెక్ట‌ర్లుగా ఉన్నార‌ని ఇది మ‌హిళా సాధికార‌త‌కు ద‌ర్ప‌ణంగా నిలుస్తుంద‌న్నారు.

దాదాపు 120 స్టార్టప్‌లకు యూనికార్న్ హోదా లభించిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్, క్వాంటం కంప్యూటింగ్ కోసం జాతీయ మిషన్లు వృద్ధికి కొత్త ఇంజన్‌లుగా మారుతున్నాయ‌న్నారు న‌రేంద్ర మోదీ. ఒక విధంగా ఆవిష్కరణ ఒక సామూహిక ఉద్యమంగా మారుతోందన్నారు.

Also Read : Sigachi Incident Sensational : సిగాచి ఘ‌ట‌న‌లో 31 మంది మృత‌దేహాలు గుర్తింపు

Exit mobile version