Sigachi Incident Sensational : సిగాచి ఘ‌ట‌న‌లో 31 మంది మృత‌దేహాలు గుర్తింపు

వెల్ల‌డించిన సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ప్రావీణ్య

Hello Telugu - Sigachi Incident Sensational

Hello Telugu - Sigachi Incident Sensational

Sigachi : హైద‌రాబాద్ – సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారం సిగాచి ప‌రిశ్ర‌మ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది. భారీ ఎత్తున ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. ఫార్మా ప‌రిశ్ర‌మలో బాయిల‌ర్ పేలి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 31 మంది మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు క‌లెక్ట‌ర్ ప్రావీణ్య వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించారు. మొత్తం 38 మంది మృతి చెందార‌ని, ఇంకా ఏడుగురి మృత‌దేహాల‌ను గుర్తించాల్సి ఉంద‌న్నారు. ప్ర‌మాదం నుంచి 61 మంది సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డార‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో 23 మంది చికిత్స పొందుతున్నార‌ని, 12 మంది డిశ్చార్జి అయ్యార‌ని చెప్పారు క‌లెక్ట‌ర్.

Sigachi Incident Updates

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఘ‌ట‌న‌పై సిగాచి (Sigachi) ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఓన‌ర్లు బ‌య‌ట‌కు రాలేదు.
దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్థ‌లం వ‌ద్ద పెద్ద ఎత్తున బాధితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు సీఎం ఎ. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌, వివేక్ వెంక‌ట స్వామి ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. మృతి చెందిన ప్ర‌తి కుటుంబానికి రూ. కోటి చొప్పున యాజ‌మాన్యం త‌ర‌పున ఇప్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. యాజ‌మాన్యం అనుస‌రిస్తున్న తీరుపై సీరియ‌స్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికి రూ. 2 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ఇస్తామ‌ని తెలిపారు.

Also Read : Ex CM KCR Health Shocking Update : మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం ప‌దిలం

Exit mobile version