PM Modi Strong Response : సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడి దారుణం : మోదీ

ఈ దాడి ప్ర‌తి భార‌తీయుడికి కోపం తెప్పించింది

Hello Telugu - PM Modi Strong Response

Hello Telugu - PM Modi Strong Response

PM Modi : ఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ పై సుప్రీంకోర్టులో విచార‌ణ సంద‌ర్బంగా ఓ లాయ‌ర్ బూటుతో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ (PM Modi) తీవ్రంగా స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. తాను సీజేఐతో మాట్లాడాన‌ని తెలిపారు. ఈ దాడి ప్ర‌తి భార‌తీయుడికీ కోపం తెప్పించేలా చేసింద‌న్నారు మోదీ. మన సమాజంలో ఇటువంటి దూషణకరమైన చర్యలకు చోటు లేదని స్ప‌ష్టం చేశారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని పిలుపునిచ్చారు మోదీ. ఈ సంఘటనను సొలిసిటర్ జనరల్, బార్ అసోసియేష‌న్ స‌భ్యులు, న్యాయ‌వాదులు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

PM Modi Respond on CJI Attack

ప్ర‌జాస్వామ్యంలో ఈ రోజు చీక‌టి రోజుగా మిగిలి పోతుంద‌ని పేర్కొన్నారు. ద్వేషం, మ‌తోన్మాదం పేరుకు పోయింద‌న్నారు. దీనికి నిద‌ర్శ‌న‌మే సీజేఐపై జ‌రిగిన దాడి అని అన్నారు. ఈ సంద‌ర్భంగా దాడి జ‌రిగిన స‌మ‌యంలో సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ ప్ర‌ద‌ర్శించిన సంయ‌మ‌నం, ప్ర‌శాంతత త‌మ‌ను మ‌రింత ఆశ్చ‌ర్య పోయేలా చేశార‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిందితుడైన న్యాయవాదిని బార్ బాడీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. దాడిపై స్పందించారు సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్. కేసుల ప్ర‌స్తావ‌న‌ను వింటూ న్యాయ‌వాదుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఇవన్నీ చూసి పరధ్యానం చెందకండని, తాము ప‌ర‌ధ్యానంలో లేమ‌ని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న విష‌యాల‌ను త‌న‌ను ఎలాంటి ప్ర‌భావం చూపించ‌వంటూ స్ప‌ష్టం చేశారు.

Also Read : CM Mamata Banerjee Fired on Modi : బెంగాల్ వ‌ర‌ద‌ల‌పై మోదీ బుర‌ద రాజ‌కీయం

Exit mobile version