KL Rahul Interesting Innings : తొలి టెస్టులో స‌త్తా చాటిన కేఎల్ రాహుల్

ఎదురీదుతున్న ప్ర‌త్య‌ర్థి వెస్టిండీస్ జ‌ట్టు

Hello Telugu - KL Rahul Interesting Innings

Hello Telugu - KL Rahul Interesting Innings

KL Rahul : అహ్మ‌దాబాద్ : భార‌త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వెస్టిండీస్ జ‌ట్టుతో ఆతిథ్య భార‌త జ‌ట్టు ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. విండీస్ టూర్ ను పుర‌స్క‌రించుకుని గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ స్టేడియంలో తొలి టెస్టు భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య ప్రారంభ‌మైంది. టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుతంగా రాణించాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. త‌ను కీల‌క పాత్ర పోషించ‌డంతో టీమిండియా 2వ రోజు 3 వికెట్లు కోల్పోయి 218 ప‌రుగులు చేసింది. 2 వికెట్లు కోల్పోయి 121 ర‌న్స్ చేసిన భార‌త్ రెండో రోజును గ్రాండ్ గా ప్రారంభించింది. ఇవాళ 50 ప‌రుగుల‌తో రాణించిన కెప్ట‌న్ శుభ‌మ‌న్ గిల్ ఉన్న‌ట్టుండి వికెట్ ను పారేసుకున్నాడు.

KL Rahul Test Match Innings

ఇక శుక్ర‌వారం లంచ్ ముగిసే స‌మ‌యానికి టీమ్ ఇండియా కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను పారేసుకుంది. మ‌రో వైపు కేఎల్ రాహుల్ సెంచ‌రీ పూర్తి చేసి ఇంకా మైదానంలో ఉన్నాడు. విండీస్ బౌల‌ర్ల‌ను చాక‌చ‌క్యంగా ఎదుర్కొన్నాడు. కళాత్మ‌కైన షాట్స్ తో అల‌రించాడు. అంత‌కు ముందు టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జ‌ట్టు 162 ప‌రుగుల‌కే కుప్ప కూలింది. విండీస్ జ‌ట్టులో రోస్ట‌న్ చేజ్ ఒక్క‌డే 37 ర‌న్స్ ఇచ్చి 2 కీల‌క వికెట్లు కూల్చాడు. ఒక‌వేళ మ్యాచ్ లో భాగంగా కేఎల్ రాహుల్ గ‌నుక మైదానంలోనే ఉంటే భార‌త జ‌ట్టు భారీ స్కోర్ ను సాధించే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నారు.

Also Read : Online Gaming Rules Shocking : ఆన్లైన్ గేమింగ్ పై కీలక నియమాలను విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ

Exit mobile version