IND vs PAK – India Sensational : క‌ర‌చాల‌నం చేసేందుకు ఒప్పుకోని కెప్టెన్

మ‌రోసారి భార‌త్ చేతిలో ప‌రాభ‌వం

Hello Telugu - IND vs PAK - India Sensational

Hello Telugu - IND vs PAK - India Sensational

IND vs PAK : దుబాయ్ : ఆసియా క‌ప్ 2025లో భాగంగా సూపర్ ఫోర్ లీగ్ లో భాగంగా జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత‌మైన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు త‌న చిరకాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించింది. ఇదే టోర్నీలో జ‌రిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ (IND vs PAK) ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం జ‌రిగిన కీల‌క పోరులో దుమ్ము రేపింది. పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం 172 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా పాకిస్తాన్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసింది. స్టార్ ప్లేయ‌ర్స్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ కేవ‌లం 31 బంతులు ఎదుర్కొని 74 ర‌న్స్ చేస్తే మ‌రో ఓపెన‌ర్ వైస్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ 47 ర‌న్స్ చేసి కీల‌క పాత్ర పోషించారు. అనంత‌రం సూర్య‌, శాంస‌న్ నిరాశ ప‌రిచినా , తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా ప‌ని కానిచ్చేశారు.

Aisa Cup 2025 IND vs PAK

మ్యాచ్ గెలుపొందిన అనంత‌రం భార‌త జ‌ట్టు పాకిస్తాన్ జ‌ట్టుతో క‌ర‌చాల‌నం చేసేందుకు విముఖ‌త చూపించింది. ఇప్ప‌టికే దీనిపై తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ సంఘ‌ట‌న‌పై పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ సంద‌ర్బంగా పాకిస్తాన్ క్రికెట‌ర్లు కొంత దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీనిపై ఐసీసీ సీరియ‌స్ అయ్యింది. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మ‌రో వైపు పాకిస్తాన్ తో ఎట్టి ప‌రిస్థితుల్లో షేక్ హ్యాండ్ ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్. ఎందుకంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ప‌హ‌ల్గామ్ లో 26 మందిని పొట్ట‌న పెట్టుకున్నార‌ని, వారికి నివాళిగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Also Read : Zubeen Garg Death : జుబీన్ గార్గ్ కు క‌న్నీటి నివాళి

Exit mobile version