వైభవ్ సూర్యవంశీపై గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

త్వ‌ర‌లో త‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ల‌భించేలా చేస్తాం

hellotelugu-GautamGambhir

ఇంగ్లండ్ : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా ఆశించిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌క పోవ‌డంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ భ‌గ్గుమంటున్నారు. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో సంజూ శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి ఏకంగా భార‌త్ కు రెండోసారి టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ అందించారు. కానీ ఆ త‌ర్వాత జ‌రిగిన టి20 సీరీస్ ల‌లో బొక్క బోర్లా ప‌డ్డారు. భార‌త సెలెక్ష‌న్ క‌మిటీ ప‌నిగ‌ట్టుకుని కొంద‌రు ప్లేయర్ల‌కు మాత్ర‌మే ప్ర‌యారిటీ ఇవ్వ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఈ త‌రుణంలో సంజు శాంస‌న్ ను ప‌క్క‌న పెట్ట‌డం, వైభ‌వ్ సూర్య వంశీని తీసుకోవ‌డం ప‌ట్ల సీనియ‌ర్ క్రికెట‌ర్లు, అన‌లిస్ట్ లు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

ఈ త‌రుణంలో హెడ్ కోచ్ గంభీర్ మాట్లాడారు. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందన్నాడు. అతను కేవలం కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడ‌ని, కాబట్టి ఇప్పుడే అతని గురించి ఒక అంచనాకు రావడం మానేయాల‌ని పేర్కొన్నాడు. అతనిలో ఉన్న ప్రతిభ మనందరికీ తెలిసిందే. అతను చాలా వేగంగా విషయాలను నేర్చుకోగల యువ ఆటగాడు, ఎంతో అనుభవంతో తిరిగి వస్తాడు. కాబట్టి, ఆ యువకుడికి తగినంత సమయం ఇవ్వాల‌ని అన్నారు. కేవలం రెండు మూడు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా అతన్ని అంచనా వేయకూడద‌ని పేర్కొన్నాడు. అతను మ్యాచ్‌ను ఒంటరిగా గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు అని ప్ర‌శంసించారు. కొన్ని బంతుల్లోనే ఆట గమనాన్ని మార్చగల‌డ‌ని చెప్పారు. అందుకే అతను ఒత్తిడి లేకుండా, సురక్షితంగా భావించేలా చూసుకుంటున్నాం అని, భవిష్యత్తులో అతనికి ఖచ్చితంగా తగినన్ని అవకాశాలు లభిస్తాయని చెప్పాడు గంభీర్.

Exit mobile version