IND vs OMAN Asia Cup Interesting : భార‌త్ విజ‌యం ఓమ‌న్ ప‌రాజ‌యం

సంజూ శాంస‌న్ షాన్ దార్ షో

Hello Telugu - IND vs OMAN Asia Cup Interesting

Hello Telugu - IND vs OMAN Asia Cup Interesting

IND vs OMAN : దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీలో భాగంగా అబుదాబి వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని భార‌త (India) క్రికెట్ జ‌ట్టు జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. వ‌రుస‌గా ఇది మూడో గెలుపు కావ‌డం విశేషం. సూర్య టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ‌ట్టు యాజ‌మాన్యం కీల‌క మార్పులు తీసుకుంది. మ్యాచ్ లో భాగంగా మైదానంలోకి వ‌చ్చిన వైస్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. కేవ‌లం 8 బంతులు ఎదుర్కొని 5 ర‌న్స్ చేసి చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స్ ల‌తో 56 ర‌న్స్ చేశాడు.

IND vs OMAN Asia Cup Match Updates

జితేష్ శ‌ర్మ , తిల‌క్ వ‌ర్మ‌, అక్ష‌ర్ ప‌టేల్ కీల‌క ర‌న్స్ చేశారు. హార్దిక్ పాండ్యా నిరాశ ప‌రిచాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఓమ‌న్ జ‌ట్టు ముందు 189 ప‌రుగుల భారీ టార్గెట్ ముందుంచింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు చుక్క‌లు చూపించింది భార‌త జ‌ట్టుకు. ఈ జ‌ట్టులో జ‌స్ప్రీత్ బుమ్రాను ప‌క్క‌న పెట్టారు. చివ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 167 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. దీంతో ఇండియా 21 ర‌న్స్ తో విజ‌యం సాధించింది. ఇండియా జ‌ట్టులో శాంస‌న్ 56 ర‌న్స్ చేస్తే ప‌టేల్ 13 బంతులు ఎదుర్కొని 26 ర‌న్స్ చేశాడు. 18 బాల్స్ ఆడి 29 ప‌రుగులు చేశాడు తిల‌క్ వ‌ర్మ‌. హ‌ర్షిత్ రాణా , అర్ష్ దీప్ సింగ్ , కుల్దీప్ యాద‌వ్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అర్ష్ దీప్ సింగ్ అరుదైన మైలు రాయి సాధించాడు. టి20 ఫార్మాట్ లో 100 వికెట్లు తీశాడు.

Also Read : YS Jagan Fired on CM Chandrababu : ప్రజారోగ్యానికి చంద్ర‌బాబు పాత‌ర : జ‌గ‌న్

Exit mobile version