YS Jagan Fired on CM Chandrababu : ప్రజారోగ్యానికి చంద్ర‌బాబు పాత‌ర : జ‌గ‌న్

గాడి త‌ప్పిన పాల‌న‌పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

YS Jagan : విజ‌య‌వాడ : సీఎం చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి (YS Jagan). ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయస్సార్‌సీపీ యూత్‌, స్టూడెంట్‌ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకున్నారంటూ ప్ర‌శ్నించారు. లాఠీచార్జ్ లు ఎందుకు చేశారు, గృహ నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా అని నిల‌దీశారు మాజీ సీఎం.

YS Jagan Slams CM Chandrababu

మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్‌ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించ కూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపల కూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులతో దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మీరింతగా తెగబడినా ప్రజా ప్రయోజనాల పరిరక్షణకోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితోపాటు యువతీ యువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారన్నారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ, ఇటు మెడికల్‌ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించార‌ని పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకోసం, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయ‌ని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్ర‌బాబుకు.

Also Read : TTD EO Anil Kumar Important Update : సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఘ‌ణంగా ఏర్పాట్లు

Exit mobile version