IND vs ENG 3rd Test Shocking : జిడ్డూ పోరాటం త‌ప్ప‌ని ప‌రాజ‌యం

మూడో టెస్టులో ఇంగ్లండ్ దే విజ‌యం

Hello Teugu - IND vs ENG 3rd Test Shocking

Hello Teugu - IND vs ENG 3rd Test Shocking

IND vs ENG : ఇంగ్లండ్ – ప్ర‌తిష్టాత్మ‌క‌మైన లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ లో భార‌త జ‌ట్టు చివ‌రి దాకా పోరాడింది. ఎవ‌రు గెలుస్తార‌న్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది. ఇంగ్లండ్ బౌల‌ర్లు అద్భుత‌మైన బౌలింగ్ దెబ్బ‌కు టీమిండియా త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఆల్ రౌండ్ ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) స్పూర్తి దాయ‌క‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నా ఓట‌మి వ‌రించింది. ఇంగ్లండ్ ఆద్యంత‌మూ ఆధిప‌త్యం కొన‌సాగించింది. మొత్తంగా మూడో టెస్టు మ్యాచ్ క్రికెట్ ప్రేమింకుల‌కు మంచి అనుభూతి ఇచ్చింది.

IND vs ENG 3rd Test Updates

22 ప‌రుగుల తేడాతో గెలుపొందింది ఇంగ్లండ్. దీంతో 5 టెస్టు సీరీస్ లో భాగంగా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది ఆతిథ్య జ‌ట్టు. గెల‌వాల్సిన మ్యాచ్ ను చేజేతులారా కోల్పోయింది టీమిండియా. బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ ఉన్న‌ప్పటికీ ఇంగ్లండ్ తో ఓడి పోవ‌డం ఒకింత భార‌తీయుల‌ను విస్తు పోయేలా చేసింది. ఆతిథ్య జ‌ట్టు భార‌త జ‌ట్టు ముందు 193 ప‌రుగుల స్వ‌ల్ప టార్గెట్ ను ముందుంచింది. ల‌క్ష్య సాధ‌న‌లో బ‌రిలోకి దిగిన టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన జ‌డ్డూ త‌న క్రికెట్ కెరీర్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

చివ‌రి దాకా త‌ను పోడిన తీరు ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా చేసింది. చివ‌ర‌లో హైద‌రాబాద్ స్టార్ పేస‌ర్ సిరాజ్ ఉన్న‌ట్టుండి అవుట్ కావ‌డంతో ప‌రాజ‌యం పాలైంది. 170 ప‌రుగుల‌కే క్లోజ్ చేసింది. జ‌డేజా ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. త‌ను 181 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు ఒక సిక్స్ తో 64 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ స్కిప్ప‌ర్ స్టోక్స్ 48 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చ‌ర్ 55 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీయ‌గా కార్స్ 30 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. స్టోక్స్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Also Read : Popular Director Meher Ramesh : పవన్ కళ్యాణ్‌తో సినిమా త‌ప్ప‌కుండా చేస్తా

Exit mobile version