ICC Test : దుబాయ్ – ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (Joe root) తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో కీలక టెస్టు మ్యాచ్ లో టీమిండియాకు వ్యతిరేకంగా తన జట్టు తరపున అద్భుతమైన సెంచరీ చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో తన రేటింగ్ పెరిగింది. ఐసీసీ తాజాగా టెస్టు మ్యాచ్ లకు సంబంధించి బ్యాటింగ్ పరంగా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో బ్యాటింగ్ జోన్ లో నెంబర్ వన్ లో నిలిచాడు జో రూట్ (Joe Root). తిరిగి తన ప్లేస్ కు చేరుకున్నాడు. ఇక తన కెరీర్ లో ఇది 37వ సెంచరీ కావడం విశేషం.
ICC Test Rankings
అంతకు ముందు 888 పాయింట్లతో రూట్ ఇంగ్లాండ్ జట్టు సహచరుడు హ్యారీ బ్రూక్ ను నెట్టేశాడు. తను ఇప్పుడు 862 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో కదం తొక్కాడు. ఆపై రెండవ ఇన్నింగ్స్ లో 40 రన్స్ చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లండ్ జట్టు. తొలి టెస్టు లో ఆతిథ్య జట్టు విక్టరీ నమోదు చేయగా 2వ టెస్టులో భారత్ గెలుపొందింది. మూడో టెస్టులో 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. కెప్టెన్ తో పాటు జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. దీంతో 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
34 ఏళ్ల వయసులో జో రూట్ ఇప్పుడు టెస్ట్ ర్యాంక్‌లో అగ్రస్థానంలో ఉన్న అతి పెద్ద వయసు బ్యాట్స్‌మన్, డిసెంబర్ 2014లో కుమార్ సంగక్కర 37 ఏళ్ల వయసులో ఉన్నాడు. బ్రూక్ మూడో స్థానానికి పడిపోవడంతో, న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (816 రేటింగ్ పాయింట్లు) భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అధిగమించి నాల్గవ స్థానంలో నిలిచాడు.
Also Read : Goat Milk Inspiring Benefits : మేక పాలుతో ఇన్ని లాభాలున్నాయని మీకు తెలుసా?
