ముంబై : మహారాష్ట్ర ఫుడ్ కమిషనర్ తుకారం ముండే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. విచిత్రం ఏమిటంటే 2005 ఐఏఎస్ బ్యాచ్ కు సంబంధించిన తుకారం తన వృత్తి నిర్వహణలో భాగంగా ఏకంగా 24 సార్లు బదిలీ అయ్యారు. తాజాగా ఆహార సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నేటి దాకా దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. రోజులో ఆయన కనీసం 20 గంటలకు పైగా ఫోకస్ పెడుతున్నారు. విచిత్రం ఏమిటంటే దేశంలో తుకారం ముండేతో పాటు చాలా మంది నిబద్దత కలిగిన ఆఫీసర్లు ఉన్నారు. వారు కూడా పలుమార్లు బదిలీలు అయ్యారు.
వారి వివరాల లోకి వెళితే..ఎక్కువ సార్లు బదిలీ అయిన అధికారిగా గుర్తింపు పొందారు ప్రదీప్ కాస్నీ. తను 71 సార్లు బదిలీ అయ్యారు. అశోక్ ఖేమ్కా 66 సార్లు, కేఎల్ మీనా 59 సార్లు, కమల్ సక్సేనా 48 సార్లు, విజయ్ సింగ్ 47 సార్లు, రాజేశ్ శ్రీవాస్తవ 47 సార్లు, రూప్ మౌద్గిల్ 40 సార్లు, సందీప్ వర్మ 30 సార్లు, అరుణ్ భాటియా 26 సార్లు బదిలీ అయ్యారు తమ వృత్తి నిర్వహణలో భాగంగా. పోస్టింగ్ ను మార్చగలరేమో కానీ తమ పదవిని లాక్కోలేరంటూ వీరంతా నిరూపించారు. ఒక చోటు నుండి మరో చోటుకు తరలించగలరు. కానీ వారి నిజాయితీని మాత్రం కదిలంచ లేరని చాటి చెప్పారు. హ్యాట్సాఫ్ వీరందరికీ. ఒత్తిళ్లను తట్టుకునే శక్తి తమకు ఉందని , ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ తుకారం ముండే.
