చెన్నై : తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం జన రంజక పాలన సాగిస్తోందన్నారు టీఎన్ యు హెచ్ డీపీ చైర్మన్ ఆర్. వలయపతి. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేసే విధానాన్ని అమలు చేశారని ప్రశంసించారు. ఇది సంపూర్ణ పారదర్శకత , ప్రజలకు జవాబుదారీతనం దిశగా ఒక చారిత్రాత్మక చర్య అని కు.పా. కృష్ణన్ పేర్కొన్నారు. పుదుక్కోట్టైలో ఇవాళ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అద్భుతమైన విజయాలు సాధించిందని చెప్పారు. అంతే కాకుండా టీవీకే సర్కార్ రాబోయే 1,000 ఏళ్లపాటు నిలిచిపోయే ఒక ఉద్యమంగా రూపు దిద్దుకుంటోందని ఆయన అన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన శాసనసభలో పూర్తి పారదర్శకత ,ప్రజలకు జవాబుదారీతనం కోసం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సభ కార్యకలాపాలను నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం చేసే విధానాన్ని అమలు చేశారని కొనియాడారు.
ఈ ప్రజాదరణ పొందిన చర్య ద్వారా తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎలా పని చేస్తున్నారో ప్రజలు స్వయంగా చూసి తెలుసుకునే అవకాశం కలిగిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో డీఎంకే వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, వారు గతంలో మాదిరిగానే వ్యవహరిస్తున్నందున వారి నుండి సహనాన్ని ఆశించలేమని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత డీఎంకేలో జరిగిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణ అనేది భయం వల్ల కాకుండా, మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న వ్యూహాత్మక చర్య అని పేర్కొన్నారు. టీవీకే మంత్రులు, కార్యకర్తలు ఇంకా అభిమానుల మానసిక స్థితి లోనే ఉన్నారని టీఎన్సీసీ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన తమిళ చరిత్రను చదవాలని సూచించారు; అటువంటి వ్యాఖ్యలు సహజమేనని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు.
