CM Revanth Reddy Alarming : 2034 వ‌ర‌కు నేనే సీఎం నేనే సుప్రీం – రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్య‌మంత్రి

Hello Telugu - CM Revanth Reddy Alarming

Hello Telugu - CM Revanth Reddy Alarming

CM Revanth Reddy : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే 2034 వ‌ర‌కు తానే తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. కేసీఆర్ నీ గుండెలపై రాసుకో అంటూ స‌వాల్ విసిరారు. పాల‌మూరు గ‌డ్డ నుంచే ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తాన‌ని అన్నారు. ఏడాదిన్నరలోగా ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తామ‌న్నారు. తానే ఇక్క‌డికి వ‌చ్చి ప్రారంభిస్తాన‌ని అన్నారు సీఎం.

CM Revanth Reddy Comments

శుక్ర‌వారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌ట‌ప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్తాప‌న చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నేనే సీఎంగా ఉంటాన‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాల‌మూరు జిల్లా ప్ర‌జ‌లు నిన్ను ఎంపీగా చేసి గెలిపిస్తే ఏం చేశావంటూ ప్ర‌శ్నించారు కేసీఆర్ ను ఉద్దేశించి. పాలమూరు బిడ్డ 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కంకణం కట్టుకుని పని చేస్తున్నందుకా దుఃఖం వస్తోందా అని నిల‌దీశారు రేవంత్ రెడ్డి.

ద‌య‌చేసి చంద్ర‌బాబు నాయుడు పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డు ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని సూచించారు. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, త‌మ‌ను బ‌త‌కనీయాల‌ని అన్నారు. పాల‌మూరు జిల్లా అంటే కేసీఆర్ కు చుల‌క‌న అని అన్నారు. త‌న‌కు రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చింది ఈ జిల్లా వాసులేన‌ని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపింది ఈ ప్రాంతం కాదా అని మండిప‌డ్డారు. ఏం చేశాడో నిరంజ‌న్ రెడ్డి చెప్పాల‌న్నారు. మొద‌టి ఏడాది లోనే రూ. 21 వేల కోట్లు రైతుల‌కు రుణ మాఫీ చేసిన ఘ‌న‌త త‌మ స‌ర్కార్ ది అన్నారు రేవంత్ రెడ్డి.

Also Read :  Minister Anam Interesting Comments : కేంద్రం నిధుల‌తో స్థానిక సంస్థ‌లు బ‌లోపేతం

Exit mobile version