విజ‌య‌ద‌శ‌మి రోజు కొత్త పార్టీ పేరు ప్ర‌క‌టిస్తా

వెల్ల‌డించిన మాజీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి

hellotelugu-VijayaSaiReddy

అమ‌రావ‌తి : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విజయదశమి నాడు తన రాజకీయ పార్టీ పేరు, విధానాలను ప్రకటించనున్నట్లు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో దివంగత బాల్ థాకరే పోషించిన పాత్రను తాను పోషిస్తానని మాజీ ఎంపీ పేర్కొన్నారు. తన పార్టీలో అధికారం జెన్-జీ యువ‌త చేతుల్లోనే ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన దూరదృష్టి గల నాయకులు ఈ కొత్త రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు చేపడతారని రెడ్డి తెలిపారు. తన కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన వివరాలను విజయదశమి రోజున వెల్లడిస్తానని మాజీ ఎంపీ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పేరు, జెండా , విధానాలకు సంబంధించిన అజెండాను కూడా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కేవలం రెండు పార్టీల ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఒక‌టి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైఎస్ఆర్సీపీ ఉండ‌గా మ‌రోటి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలోని టీడీపీ ఉంద‌ని ఆరోపించారు. ఇక కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతోంద‌ని మండిప‌డ్డారు. రెండు కుటుంబాల పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రతి నియోజకవర్గం లోనూ అంకితభావం , దృఢచిత్తం కలిగిన కొత్త నాయకత్వం ఉద్భవిస్తుందని విజ‌య సాయి రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో దివంగత బాల్ థాకరే పోషించిన పాత్రను తాను పోషిస్తానని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. అయితే కొందరు వ్యక్తులు నా పార్టీపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయ పార్టీని స్థాపించడానికి నాకు అర్హత లేదని కూడా అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. అటువంటి వ్యాఖ్యలు అనవసరమని ఆయన అన్నారు.

Exit mobile version