ఎఫ్‌సీఆర్ఏ స‌వ‌ర‌ణ బిల్లు -2026 పై త్వ‌ర‌లో నివేదిక‌

స‌భ్యుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాం

hellotelugu-FCRA2026

న్యూఢిల్లీ : విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం న్యూఢిల్లీలో ముగిసింది. చర్చల సందర్భంగా సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారని, కమిటీ తదుపరి చర్చల్లో వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ చైర్మన్ , బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ తెలిపారు . అందరూ తమ అభిప్రాయాలను తెలియ చేశామ‌ని, తాము అందరి వాదనలను శ్రద్ధగా విన్నామని పేర్కొన్నారు. కమిటీ సమావేశంలో కూర్చున్నప్పుడు, అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుని వాటిపై చర్చించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సంజ‌య్ జైస్వాల్.

21 మంది లోక్‌సభ సభ్యులతో పాటు 10 మంది రాజ్యసభ సభ్యులతో కూడిన ఈ 31 మంది సభ్యుల సంయుక్త పార్లమెంటరీ కమిటీ, విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం, 2010కు ప్రతిపాదించిన సవరణలను పరిశీలిస్తోంద‌ని వెల్ల‌డించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (2026) ప్రారంభమైన మొదటి వారం లోనే చివరి రోజు నాటికి కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందన్నారు .విదేశీ విరాళాల నియంత్రణ విధానంలోనూ అలాగే ఎఫ్ సీఆర్ ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నమోదు రద్దయిన, స్వచ్ఛందంగా వదులుకున్న లేదా చెల్లుబాటును కోల్పోయిన సంస్థలకు చెందిన నిధులు, ఆస్తుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలలోనూ మార్పులను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

పార్లమెంట్‌లో ఈ ప్రతిపాదిత చట్టంపై తదుపరి చర్చ జరగడానికి ముందే దానిని సమగ్రంగా పరిశీలించే ఉద్దేశంతో కమిటీ ఈ సమీక్షను చేపట్టిందన్నారు చైర్మ‌న్, ఎంపీ సంజ‌య్ జైస్వాల్.

Exit mobile version