Dalai Lama : టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు 90 ఏళ్లు. త్వరలోనే పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్బంగా స్పందిస్తూ తనకు ఇంకా జీవించాలని ఉందని అన్నారు. ఈ ప్రపంచంలో శాంతి కోసం ప్రయత్నం చేయాలని కోరికంద ఉందన్నారు. తాను ఇంకా 40 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంటే 130 సంవత్సరాలు బతకాలని కోరికను వ్యక్తం చేయడం ఆసక్తిని రేపుతోంది. తన 15వ పునర్జన్మను ధృవీకరించారు కూడా. తన వారసుడిని ఎన్నుకోవాలనే చైనా వాదనను ఆయన తిరస్కరించారు. తన కార్యాలయానికి మాత్రమే అధికారం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిబెటన్ అనుచరులకు భరోసా ఇచ్చారు దలైలామా.
Dalai Lama Sensational Comments
హిమాచల్‌లోని కాంగ్రా జిల్లాలోని మెక్లియోడ్‌గంజ్‌లోని ప్రధాన దలైలామా (Dalai Lama) ఆలయం సుగ్లాగ్‌ఖాంగ్‌లో తన 90వ జన్మదినోత్సవానికి ముందు దీర్ఘకాల ప్రార్థన కార్యక్రమం చేపట్టారు. 90 ఏళ్లు నిండడానికి ఒక రోజు ముందు, తన మరణం తర్వాత తాను పునర్జన్మ పొందుతానని చెప్పడం ద్వారా తన వారసత్వంపై ఊహాగానాలను పక్కన పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో చైనాకు తల వంచే ప్రసక్తి లేదన్నారు దలైలామా. ధర్మశాల ఉత్తర కొండ పట్టణం శివారులోని కొండ ప్రాంతమైన మెక్లియోడ్‌గంజ్‌లోని ప్రధాన ఆలయంలో జరిగిన ‘లాంగ్-లైఫ్ ప్రార్థన’ కార్యక్రమంలో మాట్లాడారు.
తనకు అవలోకితేశ్వరుడి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాడు. తాను కచ్చితంగా మరికొన్ని ఏళ్లు బతుకుతానని ధీమా వ్యక్తం చేశారు.టిబెటన్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని స్పష్టం చేశారు. మనం మన దేశాన్ని కోల్పోయి భారతదేశంలో ప్రవాసంలో నివసిస్తున్నప్పటికీ ఎక్కడా డ్రాగన్ చైనాకు తల వంచలేదని, ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించేలా చేశామన్నారు దలైలామా.
Also Read : Minister Atchannaidu Interesting Comments : అభివృద్దిలో ఏపీని రోల్ మోడల్ చేస్తాం – అచ్చెన్న
