బీసీల‌ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళతాం : స‌విత‌

అణగ దొక్కాలని చూస్తే సహించేది లేదని వార్నింగ్

hellotelugu-SSavitha

అమరావతి : బీసీలు రాజకీయంగా ఎదగడం జగన్ కు, గొడ్డలి పార్టీకి ఇష్టం లేదని, అందుకే అందుకే హైకోర్టుకెళ్లి స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలకు ఇచ్చిన మాటపై నిలబడతామని, హైకోర్టు తీర్పు గౌరవిస్తూనే సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీసీలను రాజకీయం అణగ దొక్కాలని చూస్తే జగన్ కు సమాధి కడతారని హెచ్చరించారు. బీసీలను అన్ని రంగాల్లోనూ ముందుంచాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అన్న ఎన్టీఆర్ 1987లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే, 1995లో రిజర్వేషన్లను 34 శాతానికి సీఎం చంద్రబాబు పెంచారని గుర్తు చేశారు. ఆనాటి నుంచి ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలవుతూ వచ్చాయన్నారు. జగన్ వచ్చిన తరవాత బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకున్నారన్నారు. కోర్టు తీర్పుల పేరుతో 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారన్నారు. జగన్ వల్లే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడుతూ స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు నిర్ణయించిందన్నారు. ఇపుడు కూడా బీసీలకు పదవులు రాకూడదని జగన్, గొడ్డలి పార్టీ నాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేసి, రిజర్వేషన్లను అడ్డుకున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను రిజర్వేషన్లు రాజకీయం అంశం మాత్రమే కాదని, వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి సవిత తెలిపారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే న్యాయ పోరాటం చేస్తామన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా సుప్రీంకోర్టులో పోరాడతామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు మరోసారి జగన్ కు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తే జగన్ కు రాజకీయ సమాధేనని మంత్రి సవిత హెచ్చరించారు.

Exit mobile version