Minister Atchannaidu Interesting Comments : అభివృద్దిలో ఏపీని రోల్ మోడ‌ల్ చేస్తాం – అచ్చెన్న

పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేసిన మంత్రి

Hello Telugu - Minister Atchannaidu Interesting Comments

Hello Telugu - Minister Atchannaidu Interesting Comments

Minister Atchannaidu : శ్రీ‌కాకుళం జిల్లా – పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా త‌మ కూట‌మి స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). శ‌నివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మిడి గ్రామంలో పర్యటించారు. సుపరిపానలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లారు. త‌మ ఏడాది పాల‌న‌లో చేసిన అభివృద్ధిపై ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం వదిలి వెళ్లిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు , లోకేష్ తిరిగి తెస్తున్నారని చెప్పారు.

Minister Atchannaidu Interesting Comments

దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా త‌మ నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రేయింబ‌వళ్లు నిద్ర‌హారాలు మాని ప‌ని చేస్తున్నార‌ని అన్నారు. కానీ గ‌తంలో పాలించిన జ‌గ‌న్ రెడ్డి రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ భ్ర‌ష్టు ప‌ట్టించాడ‌ని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక వాటిని గాడిలో పెడుతున్నాడ‌ని, దీని కోసం చాలా క‌ష్ట ప‌డాల్సి వ‌స్తోంద‌న్నారు కింజార‌పు అచ్చెన్నాయుడు.

అరాచ‌క‌, అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా ఏపీని మార్చేశాడ‌ని, గాడి త‌ప్పిన పాల‌న‌ను స్ట్రీమ్ లైజ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని చెప్పారు. ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి త‌మ నెత్తిన పెట్టి వెళ్లి పోయాడ‌ని, ఇప్పుడు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మంత్రి. ఇక‌నైనా త‌ను మారాల‌ని లేక పోతే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పినా, 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా బుద్ది రాలేదంటూ జ‌గ‌న్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Also Read : India Sensational Record : ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన 4వ దేశంగా భారత్

Exit mobile version