అమెరికా : సుంకాల దెబ్బకు భారత్, పాకిస్తాన్ అణు విపత్తును నివారించడంలో సహాయ పడ్డాయని అన్నారు. తాను కొలువు తీరాక ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేశానని చెప్పారు. తాము యుద్దాలు జరగకుండా ఆపి వేశామన్నారు. వాణిజ్యం కారణంగా జరగబోయే విపత్తును కూడా నివారించడం జరిగిందని చెప్పారు. ఇదిలా ఉండగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహంచారు. ఈ వేడుకలలో పాల్గొన్నారు ప్రెసిడెంట్.
మరోసారి బహుళ ప్రపంచ సంఘర్షణలను నివారించడంలో పేరు పొందారు ట్రంప్. భారతదేశం , పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఉద్రిక్తతతో సహా ఎనిమిది యుద్ధాలలో ఐదు యుద్ధాలను నివారించడానికి సుంకాలు, వాణిజ్య చర్చలు సహాయ పడ్డాయని తన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు మరోసారి దేశాధ్యక్షుడు.
వైట్‌హౌస్ లో కొత్తగా పునరుద్ధరించబడిన రోజ్ గార్డెన్‌లో సెనేట్ రిపబ్లికన్లతో సమావేశంలో ట్రంప్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. సుంకాలు ఆర్థిక సాధనం మాత్రమే కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కూడా అని ట్రంప్ అన్నారు. నేను ఎనిమిది యుద్ధాలను ప్రస్తావించాను, తొమ్మిది యుద్ధాలు వస్తున్నాయి. ఎనిమిది యుద్ధాలలో ఐదు పూర్తిగా వాణిజ్యం, సుంకాల ఆధారంగా ఉన్నాయని అన్నారు. రెండు అణు శక్తులు, తీవ్రమైన అణ్వాయుధాలతో పాటు ఏడు విమానాలు కూలి పోయాయని చెప్పారు. ప్రత్యేకించి తాను రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్దాన్ని తక్షణమే నిలిపి వేయాలని కోరుతూ వచ్చానని చెప్పారు ట్రంప్.















