తిరుపతి : శ్రీని రాజు తిరుపతిలోని శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ కీలకంగా మారింది. ఈ యూనివర్శిటీ ఇతర విశ్వ విద్యాలయాలకు భిన్నంగా ఉంది. ఇందులో మూడు గుర్తించాల్సిన అంశాలు ఉన్నాయి. వర్క్-స్టడీ మోడల్. అంటే Learn (నేర్చుకో), Earn (సంపాదించు), Graduate (డిగ్రీ తీసుకో). ఇది చాలా చాలా ముఖ్యం. ఈ మోడల్ గురించి చాలామంది ఇండస్ట్రీ లీడర్స్ తో, విద్యావేత్తలతో ప్రస్తావించారు మంత్రి లోకేష్. ఇండియాకి ఇప్పుడు పక్కాగా కావాల్సింది ఇదే. డిగ్రీ రాగానే చదువు ఆగిపోకూడదు. లైఫ్ లాంగ్ నేర్చుకోవడం అక్కడే మొదలవుతుంది. ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. ఈ లెగ్ (LEG) మోడల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని ఎలా వాడబోతున్నాం అనేది ముఖ్యం ఈ క్రమంలో. ప్రతి ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎన్ని జాబ్స్ తీసేసిందో, అంతకంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసింది. AI కూడా అలాంటి ఒక పెద్ద ఆపర్చునిటీ. ఒక హెచ్ఆర్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా.. AI ని నేను ఒక సపోర్టింగ్ టూల్ గా చూస్తున్నానని పేర్కొన్నారు. ఈరోజు పాలిటిక్స్ లో కూడా మేం AI ని వాడుతున్నాం. ఒక పొలిటికల్ పార్టీగా మా దగ్గర 2 టెరాబైట్ల డేటా ఉన్న డిజిటల్ లైబ్రరీ ఉంది. మేం AI వాడుతున్నాం కాబట్టే, నేను ఏదైనా ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు జస్ట్ టైప్ చేస్తే చాలు ఆన్-ది-స్పాట్ లో ఇన్ఫర్మేషన్ అంతా నా ముందుంటుంది.
చిన్న వ్యాపారాలు (MSMEలు) ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో మనందరికీ తెలుసు. వీళ్ళ లాంటి అమ్మాయిలే ఫ్యూచర్ లో ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు క్లియర్ టార్గెట్ ఇచ్చారు. ఆయన టార్గెట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక ఎంట్రప్రెన్యూర్ (One family, one entrepreneur)”. ప్రతి ఇంట్లో ఒక బిజినెస్ చేసేవాళ్ళు ఉండాలన్నది ఆయన ప్లాన్. అక్కడే AI బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు కనీసం AI యూజ్ కేస్ నైనా క్రియేట్ చేయాలి లేదా AI ని వాడటమైనా చేయాలని ఆయన మాకు చెప్తున్నారు. ఒక రైతు దగ్గర్నుంచి, తోపుడు బండి మీద అమ్ముకునేవాళ్ళు, కిరాణా షాపు వాళ్ళ నుంచి AI ఇంజనీర్ల దాకా… ప్రతి ఇంట్లో ఒక ఎంట్రప్రెన్యూర్ ఉండాలి. శ్రీని రాజు, ఇది నేను మిమ్మల్ని అడుగుతున్న మూడో కోరిక. ఈ మోడల్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేదానిపై నాకు మీ సపోర్ట్ కావాలి. మనం సక్సెస్ స్టోరీలను చూపించాలి. ‘ఒక ఫ్యామిలీ, ఒక ఎంట్రప్రెన్యూర్’ అనేది మాకు చాలా కీలకం కాబోతోందని మంత్రి లోకేష్ తెలిపారు.

















