మీ ప‌నితీరు వ‌ల్లే నాకు అవార్డు వచ్చింది : సీఎం

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : కింది నుంచి పై స్థాయి వ‌ర‌కు ప‌ని చేయ‌డం వ‌ల్ల‌నే త‌న‌కు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వ‌చ్చింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. పుర‌స్కారం అందుకున్న సంద‌ర్బంగా మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు సీఎం ఆత్మీయ విందు ఇచ్చారు .
వివిధ శాఖల్లో చక్కటి పనితీరు కనబరచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులనూ విందుకు ఆహ్వానించారు. డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ అనే పేరుతో సీఎం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. డిన్నర్ కంటే ముందు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి సమావేశం ప్రారంభం కాగానే చప్పట్లతో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు, ఉద్యోగులు.

కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు మంత్రి పయ్యావుల కేశవ్, హాజరైన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు . బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడానికి టీమ్ ఏపీ పని తీరే కారణమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని చెప్పారు. రాష్ట్ర విభజన, గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను సమావేశంలో వివరించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ‌వ్. సంస్కరణలనేవి సీఎం చంద్రబాబు డీఎన్ఏలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. విద్యుత్, ఓపెన్ స్కై పాలసీ, టెలికాం రంగం, ఐటీ, డ్రిప్ ఇరిగేషన్, పీపీపీ వంటి రంగాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే సంస్కరణలు తెచ్చారన్నారు.

Exit mobile version