హైడ్రా పేద‌ల ఇళ్ల‌ను కూల్చ‌దు : ఏవీ రంగ‌నాథ్

ఆర్ఎల్డీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

Hellotelugu-AVRanganath

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్దారించుకున్న త‌ర్వాతే హైడ్రా కూల్చి వేత‌లు ప్రారంభిస్తుంద‌ని చెప్పారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా వల్ల కలిగే ప్రయోజనాలపై బహిరంగ చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములు, పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను ఆక్రమించి వందల కోట్లు ఆర్జిస్తున్న వారి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. హైడ్రా కార్యకలాపాలు, చెరువుల కట్టల నిర్మాణం, ప్రకృతి పరిరక్షణలో హైడ్రా పాత్ర అనే అంశాలపై తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్) పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో క‌మిష‌న‌ర్ హైడ్రా పనితీరును వివరించారు. ఆక్రమణలకు పాల్పడే వారికి హైడ్రా భయపడదని అన్నారు.

వ్యవస్థల కళ్లుగప్పి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి నుండి వందల, వేల ఎకరాల భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుందని చెప్పారు. హైడ్రా ఒక్క రాత్రిలో కూలిపోయే వ్యవస్థ కాదన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఇలాపూర్ గ్రామంలో తాము 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామ‌ని అన్నారు. ఏడాది పాటు అధ్యయనం చేసి, అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాతే ఈ చర్యలు తీసుకున్నామని చ‌చెప్పారు. హైడ్రా వల్ల ఎక్కడా పేదలకు అన్యాయం జరగలేదని అన్నారు. హైడ్రా ఏర్పడి రెండేళ్లు అవుతోంది… ఈ కాలంలో 2450 ఎకరాల భూమిని ఆక్రమణల నుండి విముక్తి చేశామని అన్నారు. ఇందులో ప్రభావవంతమైన వ్యక్తుల ఆక్రమణలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ ప్రక్రియలో తమ గుడిసెలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు రంగనాథ్ తెలిపారు.

Exit mobile version