Hydraa Saved Huge Land Bank : రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

Hello Telugu - Hydraa Saved Huge Land Bank

Hello Telugu - Hydraa Saved Huge Land Bank

Hydraa : హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాల‌ను గుర్తించింది ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లో బ‌డా బాబుల ఆగ‌డాల‌కు హైడ్రా (Hydraa) చెక్ పెట్టింది. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌కు బై నంబ‌ర్లు వేసి కొట్టేయాల‌ని చేసే ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంది. దాదాపు 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని కాపాడింది. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థ‌లాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎక‌రం రూ. 200ల కోట్లు వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు 700ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేసింది.

Hydraa Saved Huge Land Bank

కొండాపూర్ విలేజ్‌లో 57.20 ఎక‌రాల విస్తీర్ణంలో 627 ప్లాట్ల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ ఏ ఎల్ కాల‌నీని 1980 లో ఏర్పాటు చేశారు. 1.20 ఎక‌రాల చొప్పున 2 పార్కులు, 2 ఎక‌రాల ప‌రిధిలో మ‌రో పార్కుతో పాటు 1000 గ‌జాల మేర ప్ర‌జావ‌స‌రాల‌కు స్థ‌లాల‌ను కేటాయించారు. ఇప్ప‌డు ఇవే ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. ఇందుకు సంబంధించి హైడ్రా సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌జా వాణిలో స్థానికులు, బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు హైడ్రా ఆక్ర‌మ‌ణ‌కు గురైన స్థ‌లాన్ని సంద‌ర్శించి ప‌రిశీలించింది. స‌ర్వే నెంబ‌ర్ల ఆధారంగా ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్లు తేల్చింది. బైనంబ‌ర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇదే విష‌య‌మై ద‌శాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ ఏ ఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రాను ఆశ్ర‌యించ‌డంతో బండారం బ‌య‌ట ప‌డింది.

Also Read : DY CM Bhatti Vikramarka – JNTU Growth : ఇంజ‌నీర్ల‌కు, ఆవిష్క‌ర్త‌ల‌కు జేఎన్టీయూ స్వ‌ర్గ‌ధామం

Exit mobile version