DY CM Bhatti Vikramarka – JNTU Growth : ఇంజ‌నీర్ల‌కు, ఆవిష్క‌ర్త‌ల‌కు జేఎన్టీయూ స్వ‌ర్గ‌ధామం

ప్ర‌శంసించిన డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

Hello Telugu - DY CM Bhatti Vikramarka - JNTU Growth

Hello Telugu - DY CM Bhatti Vikramarka - JNTU Growth

Bhatti Vikramarka : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని కొలువు తీరిన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ టెక్నాల‌జీ యూనివ‌ర్శిటీ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు భ‌ట్టి విక్రమార్క‌. రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం అన్నారు.

Telangana DY CM Bhatti Vikramarka Key Comments on JNTU Silver Jubilee

జేఎన్టీయూ యూనివర్సిటీ వేలాది మంది నైపుణ్యం క‌లిగిన‌ ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిపాలకులను తయారు చేసిందన్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా ఇక్క‌డ చ‌దువుకున్న వారే ద‌ర్శ‌నం ఇస్తార‌ని ఇది నాణ్య‌మైన అందించిన విద్య‌కు సాక్షాత్కారంగా నిలుస్తోంద‌ని చెప్పారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఇదిలా ఉండ‌గా యూనివర్సిటీకి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం లభించేలా, అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం వచ్చిన రూ. 800 కోట్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోంద‌ని ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, పుస్తకాలు, ల్యాబ్‌లు, ఆవిష్కరణలకు మరింత దగ్గరగా ఉండాలని సూచించారు. గ‌తంలో కంటే ఇప్పుడు సాంకేతిక‌ప‌రంగా ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని, మ‌రెన్నో ఉపాధి అవ‌కాశాలు మ‌న ముందున్నాయ‌న్నారు.

Also Read : Prashant Kishor Sensational Comments : నా ఆస్తుల‌న్నీ బీహర్ ప్ర‌జ‌ల కోస‌మే : ప్ర‌శాంత్ కిషోర్

Exit mobile version