Hydraa Shocking : రాజేంద్రన‌గ‌ర్ లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా

19878 గజాల పార్కు స్థలాన్ని కాపాడింది

hellotelugu-hydraa

Hydraa : రంగారెడ్డి జిల్లా : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లంలో చోటు చేసుకున్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించింది. ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే ప్ర‌జావాణి నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. పెద్ద ఎత్తున బాధితులు, ఆక్ర‌మ‌ణ‌ల గురించి ఫిర్యాదులు చేశారు. దీనిపై హైడ్రా (Hydraa) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. వెంట‌నే క‌బ్జాల నుంచి స్థ‌లాల‌ను కాపాడాల‌ని ఆదేశించారు. క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు హైడ్రా అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జన చైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది.

Hydraa Shocking

ఈ మొత్తం ఆక్ర‌మ‌ణల‌కు గురైన స్థ‌లం విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I అండ్ II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.

Also Read : PM Modi Srisailam Arrival Interesting : రేపే ప్ర‌ధాని రాక..ఏర్పాట్ల‌పై సీఎం సమీక్ష‌

Exit mobile version