PM Modi Srisailam Arrival Interesting : రేపే ప్ర‌ధాని రాక..ఏర్పాట్ల‌పై సీఎం సమీక్ష‌

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌పై ఆరా తీసిన బాబు

Hello Telugu - PM Modi Srisailam Arrival Interesting

Hello Telugu - PM Modi Srisailam Arrival Interesting

PM Modi : అమ‌రావ‌తి : ఈనెల 16న గురువారం ఏపీలో ప‌ర్య‌టించేందుకు రానున్నారు దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బుధ‌వారం పీఎం టూర్ సంద‌ర్భంగా జ‌రుగుతున్న ఏర్పాట్లుకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు పిలుపు ఇచ్చారు సీఎం. ప్ర‌ధాని శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దామ‌ని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పారు.

PM Modi Srisailam Tour Updates

కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో నిన్న గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామ‌ని, ఇది చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రాకతో ఐటీ ఎకో సిస్టం ఏర్ప‌డింద‌ని, దీని ద్వారా నాలెడ్జి ఎకనామీకి పునాది పడింద‌న్నారు. గూగుల్ డేటా హబ్ రావటంలో ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉందన్నారు. అంతే కాదు ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని స్ప‌ష్టం చేశారు. పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. క‌ర్నూల్ లో నిర్వ‌హించే సూప‌ర్ జీఎస్టీ, సూప‌ర్ స‌క్సెస్ స‌భ‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఎలాంంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు.

Also Read : Harish Rao Fired on Congress Govt : గాడి త‌ప్పిన కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న

Exit mobile version